ఏప్రిల్ చివరి వారంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్ష ఫలితాలను ఈనెల 27 లేదా 28న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
మార్చి 1న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 8న ప్రారంభమైన స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దీంతో ఫలితాల విడుదల పనులను చేపట్టేందుకు బోర్డు సిద్ధమవుతోంది.
Published date : 07 Apr 2017 01:50PM