ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో జేఈఈ మెయిన్స్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్-2019 పరీక్షలనుఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది.
బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో తాజా షెడ్యూలును ఖరారు చేసింది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాజా షెడ్యూలును ఖరారు చేసింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది.
Published date : 16 Mar 2019 02:43PM