ఏప్రిల్ 18న ఇంటర్ ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 18(గురువారం)న విడుదల చేస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఏప్రిల్ 15న ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేస్తామన్నారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. ఫలితాల కోసం www.sakshieducation.com లో చూడొచ్చు.
Published date : 15 Apr 2019 03:36PM