ఏప్రిల్ 12న ఇంటర్ సెకండియర్ ఫలితాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
రాజమండ్రిలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఏప్రిల్ 13న విశాఖలో విడుదల చేస్తారని వివరించాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు మార్కులుకాకుండా గ్రేడ్‌ల్లో ఫలితాలు ప్రకటిస్తారు. సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు యధాతథంగా మార్కుల్లోనే ఫలితాలు విడుదల చేస్తారు.
Published date : 10 Apr 2018 03:48PM