ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్ పరీక్షలు
Sakshi Education
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నవంబర్ 14న విశాఖలో విడుదల చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ప్రథమ, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 10,06,449 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతన్నారన్నారు. వీరిలో 5,25,729 మంది ప్రథమ, 4,80,720 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,448 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జనవరి 28న, ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇదే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్...
ఇంటర్ సెకండ్ ఇయర్...
ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ఇదే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్...
పరీక్ష తేదీ | పరీక్ష పేపర్ |
27-02-2019 | సెకండ్ లాంగ్వేజ్ |
01-03-2019 | ఇంగ్లిష్ |
05-03-2019 | మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్ |
07-03-2019 | మ్యాథ్స్-బి, జువాలజీ, హిస్టరీ |
09-03-2019 | ఫిజిక్స్, ఎకనామిక్స్ |
12-03-2019 | కెమిస్టీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ఆర్‌ట్స, మ్యూజిక్ |
14-03-2019 | జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,లాజిక్, బ్రిడ్‌జకోర్సు మ్యాథ్స్ |
16-03-2019 | మోడ్రన్ లాంగ్వేజ్ |
ఇంటర్ సెకండ్ ఇయర్...
పరీక్ష తేదీ | పరీక్ష పేపర్ |
28-02-2019 | సెకండ్ లాంగ్వేజ్ |
02-03-2019 | ఇంగ్లిష్ |
06-03-2019 | మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్ |
08-03-2019 | మ్యాథ్స్-బి, జువాలజీ, హిస్టరీ |
11-03-2019 | ఫిజిక్స్, ఎకనామిక్స్ |
13-03-2019 | కెమిస్టీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్‌ఆర్‌ట్స, మ్యూజిక్ |
15-03-2019 | జియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్‌జకోర్సు మ్యాథ్స్ |
18-03-2019 | మోడ్రన్ లాంగ్వేజ్ |
Published date : 15 Nov 2018 01:41PM