Skip to main content

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూలు ఖరారు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూళ్లను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది.
ఇంటర్మీడియెట్ పరీక్షలు 2017 మార్చి ఒకటో తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తేదీనుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలకు 5 లక్షల మంది, సెకండియర్ పరీక్షలకు 4.6 లక్షల మంది హాజరుకానున్నారు. ఎస్సెస్సీ పరీక్షలకు 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

పదోతరగతి 2017 పరీక్షల షెడ్యూల్

తేదీ

సబ్జెక్టు

సమయం (ఉదయం)

17-3-2017

ప్రథమ భాష పేపరు-1 (గ్రూప్-ఏ)

9:30 నుంచి 12:15 వరకు

ప్రథమ భాషపేపరు-1 (కాంపొజిట్ కోర్సు)

9:30 నుంచి 12:45 వరకు

18-3-2017

ప్రథమ భాష పేపరు-2 (గ్రూప్-ఏ)

9:30 నుంచి 12:15 వరకు

ప్రథమ భాష పేపరు-2 (కాంపొజిట్ కోర్సు)

9:30 నుంచి 10:45 వరకు

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1

9:30 నుంచి 12:45 వరకు

20-3-2017

ద్వితీయ భాష

9:30 నుంచి 12:45 వరకు

21-3-2017

ఇంగ్లిషు పేపరు-1

9:30 నుంచి 12:15 వరకు

22-3-2017

ఇంగ్లిషు పేపరు-2

9:30 నుంచి 12:15 వరకు

23-3-2017

గణితం పేపరు-1

9:30 నుంచి 12:15 వరకు

24-3-2017

గణితం పేపరు-2

9:30 నుంచి 12:15 వరకు

25-3-2017

జనరల్ సైన్‌‌స పేపరు-1

9:30 నుంచి 12:15 వరకు

27-3-2017

జనరల్ సైన్‌‌స పేపరు2

9:30 నుంచి 12:15 వరకు

28-3-2017

సోషల్ స్టడీస్ పేపరు1

9:30 నుంచి 12:15 వరకు

30-3-2017

సోషల్ స్టడీస్ పేపరు2

9:30 నుంచి 12:15 వరకు

31-3-2017

ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2

9:30 నుంచి 12:45 వరకు

01-04-2017

ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు

9:30 నుంచి 11:30 వరకు


ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ :

తేది

మొదటి సంవత్సరం

తేది

సెకండియర్

1-3-2017

ద్వితీయ భాష పేపరు-1

2-3-2017

ద్వితీయ భాష పేపరు-2

3-3-2017

ఇంగ్లిషు పేపరు-1

4-3-2017

ఇంగ్లిషు పేపరు-2

6-3-2017

మ్యాథమెటిక్స్ పేపరు-1ఎ

7-3-2017

మ్యాథమెటిక్స్ పేపరు-2ఏ

బోటనీ పేపరు-1

బోటనీ పేపరు-2

సివిక్స్ పేపరు-1

సివిక్స్ పేపరు-2

సైకాలజీ పేపరు-1

సైకాలజీ పేపరు-2

8-3-2017

మ్యాథమెటిక్స్ పేపరు-1బి

9-3-2017

మ్యాథమెటిక్స్ పేపరు-2బి

జువాలజీ పేపరు-1

జువాలజీ పేపరు-2

హిస్టరీ పేపరు-1

హిస్టరీ పేపరు-2

10-3-2017

ఫిజిక్స్ పేపరు-1

11-3-2017

ఫిజిక్స్ పేపరు-2,

ఎకనామిక్స్ పేపరు-1

ఎకనామిక్స్ పేపరు-2

క్లాసికల్ లాంగ్వేజ్ పేపరు-1

క్లాసికల్ లాంగ్వేజ్ పేపరు-2

13-3-2017

కెమిస్ట్రీ పేపరు-1

14-3-2017

కెమిస్ట్రీ పేపరు-2

కామర్స్ పేపరు-1

కామర్స్ పేపరు-2

సోషియాలజీ పేపరు-1

సోషియాలజీ పేపరు-2

ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపరు-1

ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపరు-2

15-3-2017

జియాలజీ పేపరు-1

16-3-2017

జియాలజీ పేపరు-2

హోం సెన్సైస్ పేపరు-1

హోం సెన్సైస్ పేపరు-2

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-1

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు-2

లాజిక్ పేపరు-1

లాజిక్ పేపరు-2

బ్రిడ్జికోర్సు మ్యాథ్స్ పేపరు-1 (బైపీసీ వారికి)

బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌పేపరు-2
(బైపీసీ వారికి)

17-3-2017

మోడర్న్ లాంగ్వేజ్ పేపరు-1

18-3-2017

మోడర్న్ లాంగ్వేజ్ పేపరు-2

జియాగ్రఫీ పేపరు-1

జియాగ్రఫీ పేపరు-2


తెలంగాణ షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు :
ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలను తెలంగాణ పరీక్షలతోపాటే నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా రెండు రాష్ట్రాల్లో ఒకేతేదీ, ఒకే సమయంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో దాదాపుగా ఒకేరకమైన సిలబస్, ఒకేరకమైన ప్రశ్నల తీరు ఉంటున్నందున పరీక్షలను వేర్వేరుగా కాకుండా ఒకే సమయంలో నిర్వహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్ని 2017 మార్చి 1 నుంచి మార్చి 17వరకు నిర్వహించనుంది. అదేషెడ్యూల్‌ను ఏపీలోనూ అమలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవి జరగనున్నారుు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతారుు. ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ పేపర్ జనవరి 28న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ పరీక్ష జనవరి 31న జరుగుతుంది.
Published date : 30 Nov 2016 04:09PM

Photo Stories