ఏపీలో 9న జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా
Sakshi Education
సాక్షి, అమరావతి: మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అధికారులతో ఈనెల 21న సమీక్ష నిర్వహించిన అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మితో కలసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9న జరగాల్సిన పరీక్షలను 19వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. ఇంటర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, సౌకర్యాలు లేని విద్యా సంస్థలకు నోటీసులు ఇస్తున్నామన్నారు. ఈ నెల 22తో ప్రాక్టికల్స్ పూర్తవుతాయని తెలిపారు.
25 నుంచి వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు:
ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులకు కాలేజీల్లో హాల్ టిక్కెట్లు అందిస్తున్నామని, ఈ నెల 25 నుంచి bieap.cgg.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇబ్బందులు ఉండే 18002749868 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన 0866 2974130 అనే నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, 0866 2970056 నంబర్‌కు ఫ్యాక్స్ చేయవచ్చని తెలిపారు. పరీక్ష పేపర్లు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరుస్తారని చెప్పారు. సమస్యాత్మకంగా ఉండే 35 పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Published date : 22 Feb 2017 01:57PM