Skip to main content

ఏపీ ఇంటర్మీడియెట్ ఫలితాల్లోబాలికలదే పైచేయి

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలు విజయ దుందుభి మోగించారు.
ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతంతోపాటు ర్యాంకులు, సబ్జెక్టుల్లో అత్యుత్తమ మార్కుల సాధనలోనూ అగ్రస్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈనెల 13న విజయవాడలో విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలతోపాటు వొకేషనల్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఈ ఏడాది మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత వివరాలను ప్రకటించినా, వచ్చే ఏడాది నుంచి గ్రేడ్‌ల వారీగా ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. టాప్ 10 ర్యాంకుల్లో మొదటి మూడు ర్యాంకులు, సదరు విద్యార్థుల పేర్లు, వారు సాధించిన మార్కులను వెల్లడించారు.

కృష్ణా జిల్లా ఘనత...
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగింది. ప్రథమ సంవత్సరంలో 64 శాతం, ద్వితీయ సంవత్సరంలో 77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా చూస్తే ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కడప జిల్లా ఆఖరి స్థానానికి పరిమితమైంది.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షలకు 10,31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 9,80,593 మంది రెగ్యులర్, 50,783 మంది ప్రైవేట్ విద్యార్థులున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలురతో పోలిస్తే బాలికలే అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ఏ గ్రేడ్‌లే అధికం...
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 4,29,586 మంది పరీక్ష రాయగా 3,30,986 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1,74,083 మంది (80 శాతం), బాలురు 1,56,903 మంది (74 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ఏ గ్రేడ్‌లో 2,09,243, బీ గ్రేడ్‌లో 82,530, సీ గ్రేడ్‌లో 30,403, డీ గ్రేడ్‌లో 8,810 మంది ఉన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 4,88,850 మంది పరీక్ష రాయగా, 3,14,471 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 1,67,153 మంది(69 శాతం), బాలురు 1,47,318 మంది (60 శాతం) ఉన్నారు.

వొకేషనల్‌లోనూ బాలికలదే హవా :
వొకేషనల్ కోర్సుల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. వొకేషనల్ ఫస్టియర్‌లో 27,895 మంది పరీక్ష రాయగా, 19,370 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 10,053 మంది(75 శాతం), బాలురు 9,317 మంది (64 శాతం) ఉన్నారు. సెకండియర్‌లో 34,262 మంది పరీక్ష రాయగా, 19,082 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 10,612 మంది (63 శాతం), బాలురు 8,470 మంది (49 శాతం) ఉన్నారు.

మార్కుల సాధనలో పోటాపోటీ ..
మార్కుల సాధనలో ఈసారి విద్యార్థులు పోటాపోటీగా ఉన్నారు. అగ్రస్థానంలో ఒక్కరే ఉన్నా ఆ తరువాతి స్థానాల్లో ఒకే రకమైన మార్కులు ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చాయి.

మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు :
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తాము ఆశించిన మేర మార్కులు సాధించలేదనుకున్న వారు, సబ్జెక్టులు ఫెయిలైన వారు మే 15వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చని బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి చెప్పారు. ఈ పరీక్షలకు ఈ నెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలని తెలిపారు. సమాధాన పత్రాల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వివిధ గ్రూపుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు

విద్యార్థి

హాల్‌టిక్కెట్ నం.

మార్కులు

జిల్లా

(ఎంపీసీ)

షేక్ షర్మిళ

1705247561

992

ప్రకాశం

డి.సాయివంశీ

1705247561

991

కృష్ణా

ఆర్ సాయి సృజన

1704225368

991

ప.గోదావరి

(బైపీసీ)

ఏ.నైమిష

1726213150

991

గుంటూరు

పి.లీనా

1703216386

990

తూ.గోదావరి

ఎస్.సారిక

1709229080

990

చిత్తూరు

(ఎంఈసీ)

డి.నేహ

1701210922

983

శ్రీకాకుళం

ఏ.భువనేశ్

1709236816

982

చిత్తూరు

.వై.సౌమ్య

1703215218

981

తూ.గోదావరి

(హెచ్‌ఈసీ)

ఎస్.మోజెస్ ట్వింకిల్

1704231393

962

ప.గోదావరి

పి.సునీత

1702260047

946

విశాఖపట్నం

పి.కరిష్మాఖనమ్

1706222589

935

గుంటూరు

(సీఈసీ)

ఆర్.యుక్త

1709241113

969

చిత్తూరు

కె.ఆర్.మహేశ్వరి

1712229662

965

కడప

బి.పల్లవి

1709233655

965

చిత్తూరు


పెరిగిన ఉత్తీర్ణత ...
రాష్ట్రంలో గతంలో కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు ఇంటర్ బోర్డు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఐఏఎస్ అవుతా...
రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు పొందటం సంతోషంగా ఉంది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఇదే కష్టాన్ని, క్రమశిక్షణను కొనసాగిస్తాను. నిత్యం నన్ను ప్రోత్సహించిన వీరిశెట్టి జూనియర్ కళాశాల డెరైక్టర్ నాగప్రసాద్, ప్రిన్సిపల్ శివశంకర్, తల్లిదండ్రులు షేక్ అబ్దుల్ అజీజ్, పర్వీన్, తాత మస్తాన్‌లకు రుణపడి ఉంటాను.
- షర్మిల, సీనియర్ ఎంపీసీ స్టేట్ ఫస్ట్ (992), ప్రకాశం జిల్లా పొదిలి

నా ప్రాంత వాసులకు సేవ చేస్తా...
నీట్‌లో మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్ట్ పూర్తిచేసి నా ప్రాంత వాసులకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. నాన్న ఆలపర్తి వెంకటేశ్వర్లు చిరుద్యోగి, అమ్మ సురేఖ ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. నాకు వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులకు, వీజీఆర్‌ఎం కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు.
- ఆలపర్తి నైమిష, సీనియర్ బైపీసీ స్టేట్ ఫస్ట్ (991), బాపట్ల
Published date : 14 Apr 2017 01:44PM

Photo Stories