ఎక్కువ మార్కులనే పరిగణిస్తాం : ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలనుకుంటే పరీక్ష ఫీజు రూ.450తో పాటు, అదనంగా సబ్జెక్టుకు రూ.150 చొప్పున చెల్లించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 14న ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసినప్పటికీ, మార్చి-2018 పరీక్షల్లో వచ్చిన మార్కులు, మే-2018 పరీక్షల్లో వచ్చిన మార్కులను సరిపోల్చుతూ ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు సైతం పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించినప్పటికీ... తాజాగా వచ్చే మార్కులనే పరిగణిస్తామని ప్రకటించింది.
Published date : 16 Apr 2018 01:36PM