Skip to main content

డిసెంబర్ 6 నుంచి జేఈఈ మెయిన్ హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి 11 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షల హాల్‌టికెట్లు డిసెంబర్ 6 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. ఈ మేరకు విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ (www.jeemain.nic.in) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది విద్యార్థులు హాజరు కానుండగా, దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశముంది. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
Published date : 02 Dec 2019 03:01PM

Photo Stories