Skip to main content

భారతి విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బ్రాహ్మణ విద్యార్థులు బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భారతి విద్యాపథకం ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు. భారతి విద్యా పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే ప్రతి విద్యార్థికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సాయం అందిస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో చదివేవారి అర్హతను బట్టి రూ.10 లక్షల దాకా సాయం అందుతుందన్నారు.
Published date : 09 Aug 2019 03:03PM

Photo Stories