అటెండెన్స్ ఫీజు గడువు డిసెంబర్ 31 వరకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విధానంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల హాజరు మినహాయింపు ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
మార్చిలో జరిగే పరీక్షల కొరకు నాన్ రెగ్యులర్ రూ.1,000 ఫీజు చెల్లించి హాజరు మినహాయింపును పొందవచ్చంది. ఇది ఆర్ట్స/హ్యూమనిటీస్ విద్యార్థులకే అని స్పష్టం చేసింది.
Published date : 06 Dec 2018 01:26PM