ఆగస్టు 7 నుంచి శ్రీకాకుళం,ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు కౌన్సెలింగ్
Sakshi Education
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 6న ముగిసింది.
రెండు రోజుల కౌన్సెలింగ్ అనంతరం నూజివీడు ట్రిపుల్‌ఐటీలో 974 సీట్లకు గాను 929 మంది, ఇడుపులపాయలో 966 సీట్లకు గాను 926 మంది చేరారు. కాగా,ఆగస్టు 7, 8 తేదీల్లో శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. శ్రీకాకుళంకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలోను, ఒంగోలుకు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలోను కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Published date : 07 Aug 2019 02:54PM