Skip to main content

ఆగస్టు 13 నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఆన్లైన్ 2021 ప్రవేశాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలను ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి వి రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రవేశాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50, బీసీ, ఓసీలు రూ.100 చెల్లించాలని వివరించారు. మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తరువాత రెండోవిడత ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ’హెచ్‌టీటీపీఎస్‌://బీఐఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 18002749868 నంబరులో సంప్రదించాలని సూచించారు.

చ‌ద‌వండి: వైజాగ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ– 2021 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

చ‌ద‌వండి: ఆగస్టు 16 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ తలగతులు ప్రారంభం..

చ‌ద‌వండి: వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి పీహెచ్‌డీ తప్పనిసరి.. 50 వేల మంది ఆశలు గల్లంతు..
Published date : 11 Aug 2021 01:49PM

Photo Stories