87 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ కోర్సులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలోని 87 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జూన్ 15న ఉత్తర్వులు జారీ చేశారు. 87 కేజీబీవీల్లో 2018-19 విద్యా సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో ఏవేని రెండింటికి మాత్రమే మొదటి సంవత్సరం తరగతులు నిర్వహించవచ్చని సూచించారు. 2019-20లో ద్వితీయ సంవత్సరం కోర్సులు నిర్వహించాలని పేర్కొన్నారు.
Published date : 16 Jun 2018 01:54PM