Skip to main content

450 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ‘మధ్యాహ్న భోజనం’

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 450 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జూలై 25న ఉత్తర్వులు జారీచేశారు.
ఇందుకోసం అవసరమయ్యే నిధులను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. ఆగస్టు 1వ తేదీనుంచి ఆయా కాలేజీల్లోని 1,74,683 మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం అందనుంది. అమలుపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

పాఠశాలల విద్యార్థులకు వారానికి 5 గుడ్లు :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో వారానికి ఇకపై ఐదు గుడ్లు సరఫరా చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం వారానికి 3 గుడ్లు ఇస్తుండగా ఇకనుంచి 5 గుడ్లు వడ్డించనున్నారు.
Published date : 26 Jul 2018 05:46PM

Photo Stories