Skip to main content

28, 31న ‘ఇంటర్’ హ్యూమన్ వ్యాల్యూస్, పర్యావరణ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 28, 31 తేదీల్లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, పర్యావరణ విద్య పరీక్షలను నిర్వహిం చనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. వీటిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వబోమని వివరించింది. గతంలో ఈ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పాత హాల్‌టికెట్ నంబర్‌తో పరీక్ష రాయవచ్చని, వారు ఇందుకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Published date : 25 Jan 2017 01:45PM

Photo Stories