Skip to main content

10న ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 872 పరీక్ష కేంద్రాల్లో గత నెల 15 నుంచి 30 వరకు ఈ పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు 4,78,280 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 3,26,632 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,51,648 మంది ఉన్నారు.
Published date : 07 Jun 2017 04:32PM

Photo Stories