Indian Forest Service 2025 Notification : ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2025.. ప్రిలిమ్స్‌కు నోటిఫికేషన్ విడుదల.. ఎప్పుడు?
➔ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ తేదీ: 2025, జనవరి 22
➔ దరఖాస్తు చివరి తేదీ: 2025, ఫిబ్రవరి 11
➔ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 2025, మే 25
➔ మెయిన్ ఎగ్జామినేషన్: 2025, నవంబర్ 16 నుంచి ఏడు రోజులు.
ఐఎఫ్‌ఎస్ అర్హత
బీఎస్సీలో..యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్/బోటనీ/ కెమిస్ట్రీ/ జియాలజీ/ మ్యాథ్స్/ ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/జువాలజీ/ఏజీబీఎస్సీ/ఫారెస్ట్రీలో బ్యా చిలర్ డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు.
IES and ISS Exam Notification : కేంద్ర ఆర్థిక శాఖలో ఈ కొలువులకు ఐఈఎస్, ఐఎస్ఎస్.. నోటిఫికేషన్ విడుదల తేదీ!
మూడు దశల్లో ఎంపిక
➔ సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత కీలకమైన పరీక్షగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను పేర్కొనొచ్చు. కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ హోదాలో అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఇది. ఐఎఫ్‌ఎస్ ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అభ్యర్థులు సివిల్స్ నోటిఫికేషన్‌ను అనుసరించి.. ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సివిల్స్ ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా.. తదుపరి దశలో ఐఎఫ్‌ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి.పేపర్–1లో జనరల్ ఇంగ్లిష్–300 మార్కులు, పేపర్–2లో జనరల్ నాలెడ్జ్–300 మార్కులు; పేపర్–3(ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్–1), పేపర్–4(ఆప్షనల్ సబ్జెక్ట్–పేపర్ 2), పేపర్–5(ఆప్షనల్ సబ్జెక్ట్ –2 పేపర్–1), పేపర్– 6 (ఆప్షనల్ సబ్జెక్ట్ 2 పేపర్–2). ఆప్షనల్ సబ్జెక్ట్‌లకు సంబంధించి.. ప్రతి పేపర్‌కు 200 మార్కులు ఉంటాయి. ఇలా మొత్తం 1400 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ
మొయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను చివరగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఖాళీలు, అభ్యర్థుల కేటగిరి, వచ్చిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులను క్రోడీకరించి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
Tags
- UPSC
- UPSC jobs
- Competitive Exams Notifications
- Indian Forest Service Exam
- IFS Notification 2025
- government jobs notifications
- civils services exams
- IFS Prelims and Mains
- Eligible Candidates
- competitive exams 2025
- Education News
- Sakshi Education News
- indianforestserviceexam
- IFSEligibility
- CivilServices
- BScDegreesForIFS
- BTechEligibilityIFS
- AnimalHusbandryIFS
- Veterinary Science Courses
- Botany
- Forestry Bachelor degree
- IFSCareerOpportunities
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications