TS ICET 2023: ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి అక్టోబర్ 15 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
స్లాట్‌బుక్ చేసుకున్నవారు 16న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవ్వాలని, 16 నుంచి 17 వరకు ఆప్షన్లు ఇవ్వొచ్చంది. అక్టోబర్ 20న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. సీట్లు వచ్చిన అభ్యర్థులు 29లోగా ఆన్‌లైన్, 31వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది.