JNTU Anantapur: ఎంసీఏకు యమ క్రేజీ
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో మొత్తం 68 కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించడానికి ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది ఎంబీఏ మొత్తం 9,912 సీట్లు, ఎంసీఏ 5,640 సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి లభించింది. గతేడాది ఎంసీఏ సీట్లు 2,790 మాత్రమే కేటాయించగా, తాజాగా 5,640 సీట్లు కావాలని కోరారు. ఈ మేరకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకోగా, ఇందుకు జేఎన్‌టీయూ అనంతపురం ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో ఎంసీఏ కోర్సుకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఐసెట్ కౌన్సెలింగ్ షురూ
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తరువాత అత్యంత ప్రాధాన్యం ఉన్న ఐసెట్–2023 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఏపీ ఐసెట్‌ను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పకడ్బందీగా నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. గురువారం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
- ఈ నెల 8 నుంచి 14 వరకు వెబ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్.
- 9 నుంచి 16వ తేదీ వరకు సర్టిపికెట్ల పరిశీలన.
- 12న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన.
- 19 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.
- 22న వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం.