TS ICET 2023 First Ranker: ఉద్యోగం మానుకుని ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యాడు
![TS ICET 2023 First Ranker](/sites/default/files/images/2023/06/30/sarankumar-1688127384.jpg)
జూన్ 29న విడుదలైన ఫలితాలలో శరణ్ కుమార్ 161 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు. హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన నూకల మల్లికార్జునరావు, నిర్మల కుమారుడైన శరణ్‌కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత మూడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానుకుని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రాసి గ్రూప్ బి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం అయన పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. డిస్టెన్స్‌లో ఎంబీఏ చేయాలనే ఉద్దేశంతో టీఎస్ ఐసెట్ పరీక్షలు రాసి మొదటి ర్యాంక్ సాధించారు.
చదవండి:
TSPSC Group IV Exam: 2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు.. టీఎస్‌పీఎస్సీ సూచనలు ఇవే
Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?