Biology Study Material and Model Questions : రక్తపోటును నియంత్రించే హార్మోన్..? పోటీ పరీక్షల్లో ఉపయోగపడేలా.. మాదిరి ప్రశ్నలతో..
ఎడ్రినలిన్ హార్మోన్ హృదయ స్పందన రేటును పెంచి గుండె΄ోటుకు కారణమవుతుంది. ్ర΄÷జెస్టిరాన్‌ను ప్రెగ్నెన్సీ హార్మోన్, గర్భస్రావ నిరోధక హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది. పీనియల్ గ్రంథి మానవుడి మెదడు ద్వారగోర్థం పృష్టతలంలో ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది.
అంతస్స్రావక గ్రంథులు
1. ఎడ్రినల్ (అధివృక్క) గ్రంథులు
మానవుడిలో ఒక జత ఎడ్రినల్ గ్రంథులు మూత్ర పిండాల పైభాగంలో ఉంటాయి. అధివృక్క గ్రంథిలో రెండు భాగాలుంటాయి. 1. వల్కలం.. అధివృక్క గ్రంథి వెలుపలి భాగం. 2. దవ్వ.. లోపలి భాగం.
అధివృక్క వల్కల హార్మోన్లు: దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లను కార్టికాయిడ్లు అంటారు. ఇవి మూడు రకాలు.
ఎ) కార్టిసాల్ బి) అల్డోస్టిరాన్
సి) లైంగిక కార్టికాయిడ్లు
కార్టిసాల్
ఈ హార్మోన్ పిండి పదార్థాల జీవక్రియలో పాల్గొంటుంది. ఉపవాస(అత్యవసర) పరిస్థితుల్లో గ్లూకోజ్‌ను సంశ్లేషించి రక్తంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి కార్టిసాల్‌ను ప్రాణరక్షక హార్మోన్ అంటారు. ఇది ఒక ఒత్తిడి పోరాట హార్మోన్‌గా కూడా పనిచేస్తుంది. కార్టిసాల్ అధికస్రావం వల్ల కూషింగ్స్ వ్యాధి (బఫెల్లో నెక్) వస్తుంది.
☞ లక్షణాలు: ముఖం, అవయవాలు, వీపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది.
వీపుపై మూపురం (బఫెల్లో హంప్) వేలాడుతూ ఉంటుంది.
కార్టిసాల్ తక్కువైతే అడిసన్స్ వ్యాధి వస్తుంది.
లక్షణాలు: చర్మంపై కంచు వర్ణపు మచ్చలు, బరువు కోల్పోవడం, కండరాల బలహీనత.
MBBS Seats In Andhra Pradesh: ఎంబీబీఎస్ సీటుకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన కటాఫ్
అల్డోస్టిరాన్
ఇది దేహంలో నీరు, లవణాల తుల్యతను క్రమపరుస్తుంది. మూత్రం నుంచి సోడియం (NA+) పునఃశోషణను పెంచుతుంది. అదే
సమయంలో పొటాషియం (K+), ఫాస్ఫేట్ అయాన్లను మూత్రంలోకి స్రవింపజేయడంలో తోడ్పడుతుంది. శరీరంలో పొటాషియం అయాన్ల గాఢత పెరగడం ప్రమాదకరం. కాబట్టి అధివృక్క ఆల్డోస్టిరాన్ లోపిస్తే మానవుడు మరణిస్తాడు.
లైంగిక కార్టికాయిడ్లు
ఇవి ఒక రకమైన లైంగిక హార్మోన్లు(ఆండ్రోజన్స్). ఇవి స్త్రీ, పురుషుల్లో లైంగిక హార్మోన్లకు అనుబంధంగా పనిచేస్తాయి.
ఈ హార్మోన్ల అధిక స్రావం వల్ల స్త్రీ , పురుషుల్లో వ్యాధులు వస్తాయి. అవి..
☞ విరిలిజం: స్త్రీలకు అవాంఛిత రోమాలు (గడ్డాలు, మీసాలు) రావడం, పురుష గొంతు.
☞ హిర్సుటిజం: స్త్రీలకు ఛాతీపైన, శరీరంపైన రోమాలు రావడం.
☞ గైనకోమాస్టియా: ఇది పురుషులకు వచ్చే వ్యాధి. పురుషులకు రొమ్ములు ఏర్పడటం.
అధివృక్క దవ్వ
అధివృక్క దవ్వ రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
ఎ) ఎడ్రినలిన్ (ఎఫినెఫ్రిన్)
బి) నార్ ఎడ్రినలిన్ (నార్ ఎఫినెఫ్రిన్)
ఇవి ఒత్తిడి, అత్యవసర పరిస్థితులకు అనుక్రియగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి వీటిని అత్యవసర హార్మోన్లు (ఎమర్జెన్సీ హార్మోన్లు), పోరాట లేదా పలాయన హార్మోన్లు, 3F హార్మోన్ (Fight -Flight - Fright), 4S హార్మోన్ ( Sugar Metabolism, Salt retainning, Sex hormones, Source of Energy)), బీపీ హార్మోన్ లేదా రక్తనోటుకు కారణమైన హార్మోన్ అని పిలుస్తారు.
ఈ హార్మోన్ల వల్ల భయం, కోపం వంటి భావోద్వేగాలకు లోనైనప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం, చెమటపట్టడంతో పాటు హృదయస్పందన, శ్వాసక్రియ రేటు పెరుగుతాయి.
ఎడ్రినలిన్
హృదయ స్పందన రేటును పెంచి గుండెపోటుకు (బీపీ) కారణమవుతుంది.
నార్ ఎడ్రినలిన్
ఈ హార్మోన్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది (నియంత్రిస్తుంది)
గమనిక: లోనోట్రోప్స్ రక్తపోటును తగ్గించడానికి వాడే ఔషధం.
2. బీజకోశాలు
బీజకోశాలు రెండు రకాలు..
1) పురుష బీజకోశాలు (ముష్కాలు)
2) స్త్రీ బీజ కోశాలు
ముష్కాలు / పురుష బీజకోశాలు
ముష్కాలు పురుష ప్రత్యుత్పత్తి అంగాలు. ఒక జత ముష్కాలు శరీరం వెలుపల ముష్క గోణుల్లో ఉంటాయి.
☞ ముష్కాల ప్రధాన విధి: శుక్రకణోత్పత్తి, హార్మోన్ విడుదల. ముష్కాల్లోని లిడిగ్ కణాల నుంచి టెస్టోస్టిరాన్ (ఆండ్రోజెన్) అనే లైంగిక హార్మోన్ విడుదలవుతుంది.
☞ టెస్టోస్టిరాన్ విధి: కండరాల అభివృద్ధి,
ముఖం, బాహుమూలాల్లో రోమాలు ఏర్పడటం, పురుష కంఠధ్వని (గొంతు మారడం). ఈ లక్షణాలను ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు.
Posts at NIO : ఎన్‌ఐఓలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులకు దరఖాస్తులు..
స్త్రీ బీజకోశాలు
స్త్రీలలో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉదర కుహరంలో ఉంటాయి.ప్రాథమికంగా ఇవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ప్రతి రుతుచక్రంలోనూ ఒక అండాన్ని విడుదల చేస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెక్టిరాన్‌లను విడుదల చేస్తాయి.
☞ ఈస్ట్రోజన్: ఈ హార్మోన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలను ప్రేరేపిస్తుంది. అంటే రుతుచక్ర ప్రారంభం, స్తనాభివృద్ధి, స్త్రీ కంఠస్వరం.
☞ ప్రొజెస్టిరాన్: దీన్ని ప్రెగ్నెన్సీ హార్మోన్, గర్భస్రావ నిరోధక హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ పిండ ప్రతిస్థాపనకు తోడ్పడుతుంది. ఫలధీకరణ ద్వారా ఏర్పడిన పిండాన్ని గర్భాశయ గోడలకు అంటి పెట్టడంలో దోహదపడుతుంది. ఈ హార్మోన్ రుతుచక్రం ఆగిపోవడానికి, మళ్లీ ఫలధీకరణ జరగకుండా ఉండటానికి తోడ్పడుతుంది. కాబట్టి గర్భ నిరోధక మాత్రల్లోప్రొజెస్టిరాన్‌ను ఉపయోగిస్తారు. ఈ హార్మోన్ జరాయువు ఏర్పడటానికి తోడ్పడుతుంది.
☞ రిలాక్సిన్ హార్మోన్: ఈ హార్మోన్‌ను ప్రసవ సమయంలో జరాయువు స్రవిస్తుంది. ఇది సుఖ ప్రసవానికి దోహదపడుతుంది.
3. థైమస్ గ్రంథి (బాలగ్రంథి)
ఈ గ్రంథి రెండు ఊపిరితిత్తుల మధ్య గుండెకు దగ్గరగా ఉంటుంది. ఇది తల్లిగర్భంలో ఉన్న పిండం(ఆరో వారం)లో ఏర్పడుతుంది. ఇది చిన్న పిల్లల్లో మాత్రమే ఉంటుంది. కౌమార దశలో అదృశ్యమ వుతుంది. కాబట్టి దీన్ని బాలగ్రంథి, తాత్కాలిక గ్రంథి, తిరోగమన గ్రంథి, అంతరించిపోయే గ్రంథి అని పిలుస్తారు. ఈ గ్రంథి స్రవించే హార్మోన్ థైమోసిన్.
☞ థైమోసిన్ విధి: లింఫోసైట్ కణాల పరిపక్వతకు తోడ్పడుతుంది. ఫలితంగా ప్రతిరక్షకాలు(యాంటిబాడీలు)ఉత్పత్తి అవుతాయి. ఇవి వ్యాధి నిరోధకతను పెం΄÷ందిస్తాయి. మాంసం దుకాణాల్లో జంతువుల థైమస్ గ్రంథిని స్వీట్ బ్రెడ్‌గా అమ్ముతారు.
☞ ఎక్టో హార్మోన్లు: కొన్ని వినాళ గ్రంథుల నుంచి బాహ్య వాతావరణంలోకి విడుదలయ్యే రసాయన పదార్థాలను ఎక్టో హార్మోన్లు లేదా పిరమోన్లు అంటారు. ఈ పిరమోన్లు కీటకాల్లో మాత్రమే ఉంటాయి.
☞ ఒక జాతి జీవుల నుంచి విడుదలయ్యే పిరమోన్లను అదే జాతికి చెందిన కీటకాలు మాత్రమే గుర్తిస్తా యి. దీంతో వాటి మధ్య ఆకర్షణ, కమ్యూనికేషన్స్ నెలకొంటాయి.
ఉదా: కూలీ చీమ మార్గాన్ని ఇతర చీమలు పిరమోన్ల వల్లే అనుకరిస్తాయి.
Union Cabinet: మూడు నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. అవి ఏవంటే..
4. పీనియల్ గ్రంథి
ఇది మానవుడి మెదడు ద్వారగోర్థం పృష్టతలంలో ఉంటుంది. మెలటోనిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. ఇది శరీరంలోని 24 గంటల దిన పరివర్తన లేదా సర్కేడియన్ లయలను క్రమపరుస్తుంది. అంటే నిద్ర, మెలకువల వలయాన్ని నియంత్రిస్తుంది.
5. జఠరాంత్రనాళ హార్మోన్లు
జీర్ణాశయం, ఆంత్రమూలాల శ్లేష్మçస్తరం హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీర్ణ గ్రంథుల చర్యలను పరిరక్షిస్తాయి. ఇది నాలుగు రకాల పెపై్టడ్ హార్మోన్లను స్రవిస్తుంది. అవి...
u గాస్ట్రిన్: ఈ హార్మోన్‌ను జీర్ణాశయం స్రవిస్తుంది. ఇది జఠర గ్రంథులను ప్రభావితం చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సినోజన్ విడుదలను ప్రేరేపిస్తుంది.
u సెక్రిటిన్: ఆంత్రమూలం నుంచి విడుదలయ్యే ఈ హార్మోన్ క్లోమ, పైత్య రసాల స్రావాన్ని ప్రేరేపిస్తుంది. మొదట కనుగొన్న హార్మోన్ సెక్రిటిన్
u కోలిసిస్టోకైనిన్: ఇది కూడా ఆంత్రమూలం నుంచి విడుదలవుతుంది. పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసాన్ని ఆంత్రమూలంలోకి విడుదల చేయిస్తుంది.
u పాంక్రియోజైమిన్: దీన్ని ఆంత్రమూలం స్రవి స్తుంది. ఈ హార్మోన్ క్లోమాన్ని ఉత్తేజపర్చి క్లోమరసం విడుదలకు దోహదపడుతుంది.
Subhadra Yojana: మహిళలకు శుభవార్త.. వారి అకౌంట్‌లో రూ.50 వేలు.. అర్హులు వీరే!
గతంలో వచ్చిన ప్రశ్నలు:
1. రక్తపోటును నియంత్రించే హార్మోన్?
1) థైరాక్సిన్ 2) ఇన్సులిన్
3) ఎడ్రినలిన్ 4) పిట్యూటరీ గ్రంథి
2. ఇన్సులిన్, ఈస్ట్రోజన్ అనేవి ?
1) బ్యాక్టీరియాలు 2) ఫంగస్‌లు
3) క్రిములు 4) హార్మోన్లు
3. అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ గ్రంథి
2) ఎడ్రినల్ గ్రంథి
3) థైరాయిడ్ గ్రంథి
4) సెలైవరీ గ్రంథి
4. మానవ దేహంలో అధివృక్క గ్రంథి వేటిపై ఉంటుంది?
1) చిన్నప్రేగు 2) గుండె
3) ఊపిరితిత్తులు 4) మూత్ర పిండాలు
5. తమ జాతి జీవులపై ప్రభావం చూపించేవి, జీవి శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) సబ్‌హార్మోన్లు
2) న్యూరోహార్మోన్లు
3) పిరమోన్లు
4) న్యూరోట్రాన్స్ మీటర్
Breaking News Results Released: యూనివర్సిటీ ఫలితాలు విడుదల
6. స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది?
1) ఈస్ట్రోజన్ 2) ఆక్సిటోసిన్
3) టెస్టోస్టిరాన్ 4)ప్రొజెస్టిరాన్
7. శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి?
1) థైరాయిడ్ గ్రంథి
2) థైమస్ గ్రంథి
3) పీనియల్ గ్రంథి
4) పీయూష గ్రంథి
8. గర్భ నిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్?
1) ఈస్ట్రోజెన్ 2)ప్రొజెక్టిరాన్
3) ఆక్సిటోసిన్ 4)ప్రొలాక్టిన్
9. పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసాన్ని స్రవింపజేసే హార్మోన్?
1) సెక్రిటిన్ 2) ఇన్సులిన్
3) కోలిసిస్టోకైనిన్ 4) ఎడ్రినలిన్
10. లైంగిక కార్టికాయిడ్ల అధికస్రావం వల్ల వచ్చే వ్యాధి?
1) విరిలిజం
2) హిర్సుటిజం
3) గైనకోమాస్టియా
4) పైవన్నీ
సమాధానాలు
1) 3; 2) 4; 3) 2; 4) 4;
5) 3; 6) 1; 7) 2; 8) 2;
9) 3; 10) 4.
Govt ITI Job Opportunities news: ప్రభుత్వ ITIలో ఉద్యోగ అవకాశాలు
Tags
- biology study material
- Competitive Exams
- groups exams preparations
- civils services preparations
- study material for groups exam
- appsc and tspsc groups exams
- appsc and tspsc biology exam
- biology material and model questions
- model questions for easy preparations
- model questions for groups exams preparations
- appsc tspsc and civils study material
- Education News
- Sakshi Education News