భారతీయ సమాజ శాస్త్ర మౌలికాంశాలు - కులం
1. ‘సమాజ శాస్త్రం’ (Sociology) అనే పదాన్ని మొదట రూపొందించిందెవరు?
ఎ) సోక్రటీస్
బి) అరిస్టాటిల్
సి) ఆగస్ట్ కోమ్ట్
డి) దుర్కహైమ్
- View Answer
- సమాధానం: సి
2. 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిని జతపరచండి?
1) హిందువులు | ఎ) 79.8 శాతం |
2) ముస్లింలు | బి) 14.2 శాతం |
3) క్రైస్తవులు | సి) 2.3 శాతం |
4) సిక్కులు | డి) 1.7 శాతం |
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
- View Answer
- సమాధానం: ఎ
3. సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) దుర్క్ హైమ్
బి) మాక్స్ వెబర్
సి) అరిస్టాటిల్
డి) ఆగస్ట్ కోమ్ట్
- View Answer
- సమాధానం: డి
4. భారతీయ సమాజం వివిధ జాతుల ప్రదర్శన శాల (Ethnological Museum) అని పేర్కొన్నవారు?
ఎ) వి.ఎ.స్మిత్
బి) జిమ్మెల్
సి) పరేటో
డి) మాకియవెల్లీ
- View Answer
- సమాధానం: ఎ
5. సమాజ శాస్త్రం శాస్త్రీయంగా దేన్ని అధ్యయనం చేస్తుంది?
ఎ) మానవుడిని
బి) మానవ సంఘాలను
సి) వ్యక్తుల మధ్య ఉన్న సామాజికసంబంధాలను
డి) పౌరుల హక్కులు, విధులను
- View Answer
- సమాధానం: సి
6. భారత రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది?
ఎ) 22
బి) 24
సి) 25
డి) 26
- View Answer
- సమాధానం: ఎ
7. ది పీపుల్ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) మలినో విస్కీ
బి) బి.ఎస్. గుహా
సి) రిస్లీ
డి) హెడన్
- View Answer
- సమాధానం: సి
8. సమాజ శాస్త్రం (Sociology) అనే పదం లాటిన్ భాషలోని సొసైటస్(Societus), గ్రీకు భాషలోని లోగోస్(Logos) అనే పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థం?
ఎ) సమాజం, శాస్త్రం
బి) సమాజం, సూత్రాలు
సి) సామూహిత, శాస్త్రం
డి) సామాహికత, శాస్త్రం
- View Answer
- సమాధానం: ఎ
9. కింది వాటిలో దక్షిణ భారత సాంస్కృతిక అంశం కానిది?
ఎ) హిందుస్తానీ సంగీతం
బి) జల్లికట్టు
సి) యక్షగానం
డి) భరతనాట్యం
- View Answer
- సమాధానం: ఎ
10. ‘మానవుడు సామాజిక జంతువు’ అని చెప్పినవారు?
ఎ) ఆగస్ట్ కోమ్ట్
బి) దుర్క్ హైమ్
సి) హెర్బర్ట్ స్పెన్సర్
డి) అరిస్టాటిల్
- View Answer
- సమాధానం: డి
11. సమాజం అంటే ‘సామాజిక సంబంధాల అల్లిక’ అని చెప్పిందెవరు?
ఎ) ఆగస్ట్ కోమ్ట్
బి) హెర్బర్ట్ స్పెన్సర్
సి) మెక్ ఐవర్
డి) మాక్స్ వెబర్
- View Answer
- సమాధానం: సి
12. పరిణామ సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
ఎ) ఆగస్ట్ కోమ్ట్
బి) హెర్బర్ట్ స్పెన్సర్
సి) దుర్క్ హైమ్
డి) చార్లెస్ డార్విన్
- View Answer
- సమాధానం: డి
13. ‘ది సోషల్ సిస్టమ్’ గ్రంథ రచయిత?
ఎ) మార్టన్
బి) పార్సన్స్
సి) కార్ల్ మార్క్స్
డి) ఆగస్ట్ కోమ్ట్
- View Answer
- సమాధానం: బి
14. సోషల్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్ గ్రంథ రచయిత?
ఎ) రాబర్ట్ కె మర్టన్
బి) రాబర్ట్ పార్క్
సి) రాడ్క్లిఫ్ బ్రౌన్
డి) దుర్ఖెయిమ్
- View Answer
- సమాధానం: ఎ
15.‘ఎక్కడైతే జీవితం ఉందో, అక్కడ సమాజం ఉంది’ అని చెప్పింది?
ఎ) మెక్ ఐవర్
బి) కింగ్సలీ డేవిస్
సి) దుర్క్ హైమ్
డి) మాక్స్ వెబర్
- View Answer
- సమాధానం: ఎ
16. సంస్కృతి అంటే?
ఎ) వేషభాషలు, నడవడి విధానం, మతం, కళలు మొదలైన వాటి సమ్మేళనం
బి) శాస్త్రీయ, సాంకేతికాభివృద్ధి
సి) ఒక సముదాయం సాధించిన ఉన్నత అంశాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
17. ‘సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా’ అనే గ్రంథ రచయిత?
ఎ) రామ్ అహుజా
బి) కుప్పుస్వామి
సి) కేట్కార్
డి) ఎం.ఎన్. శ్రీనివాస్
- View Answer
- సమాధానం: డి
18. ‘ద సోషల్ కాంట్రాక్ట్’ గ్రంథ రచయిత? (సీడీపీవో-2013)
ఎ) టానీస్
బి) రూసో
సి) అరిస్టాటిల్
డి) ప్లేటో
- View Answer
- సమాధానం: బి
19.‘ఇంత వరకు ఉన్న సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాట చరిత్రయే’ అని పేర్కొన్నవారు? (గ్రూప్-2, 2000 బ్యాగ్లాగ్ పోస్ట్)
ఎ) లెనిన్
బి) మావో
సి) కార్ల్ మాక్స్
డి) హిట్లర్
- View Answer
- సమాధానం: సి
20. కులం అభివ్యక్తీకరణల్లో అస్పృశ్యతను అతినికృష్టమైందిగా పరిగణించిన వారు? (సీడీపీవో-2013)
ఎ) ఎం.ఎన్. శ్రీనివాస్
బి) సర్ధార్ పటేల్
సి) నెహ్రూ
డి) గాంధీ
- View Answer
- సమాధానం: సి
21. ‘క్యాస్ట్ ఇన్ మోడ్రన్ ఇండియా’ గ్రంథ రచయిత? (సీడీపీవో-2013)
ఎ) హట్టన్
బి) ఘుర్యే
సి) కుప్పుస్వామి
డి) ఎం.ఎన్. శ్రీనివాస్
- View Answer
- సమాధానం: డి
22. ఉన్నత అంతస్తును సాధించడానికి తొలిమెట్టుగా... ఉన్నత కులాల వారి ఆచారాలు, నమ్మకాలను నిమ్న కులాల వారు సమష్టిగా అవలంభించే ప్రక్రియను ఏ పేరుతో పిలుస్తారు? (సీడీపీవో-2013)
ఎ) ఆధునికీకరణ
బి) సంస్కృతీకరణ
సి) పాశ్చాత్యీకరణ
డి) నగరీకరణ
- View Answer
- సమాధానం: బి
23. గ్రామాల్లో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? (సీడీపీవో-2013)
ఎ) బంధుత్వం
బి) వర్గం
సి) స్నేహం
డి) జాజ్మాని(Jajmani)
- View Answer
- సమాధానం: డి
24. బ్రహ్మ ఏ అవయవం నుంచి క్షత్రియులు ఆవిర్భవించారు?(సీడీపీవో-2013)
ఎ) పాదాలు
బి) తొడలు
సి) చేతులు
డి) భుజాలు
- View Answer
- సమాధానం: డి
25. కుల క్రమానుగత శ్రేణిలో అన్నిటికంటే పై శ్రేణిలో ఉండేవారు? (సీడీపీవో-2013)
ఎ) వైశ్యులు
బి) బ్రాహ్మణులు
సి) శూద్రులు
డి) క్షత్రియులు
- View Answer
- సమాధానం: బి
26. ‘ది అన్టచబుల్స్’ అనే గ్రంథాన్ని రాసిందెవరు?
ఎ) శ్రీనివాస్
బి) అంబేద్కర్
సి) ఘుర్యే
డి) గాంధీ
- View Answer
- సమాధానం: బి
27. అస్పృశ్యులను ‘హరిజనులని’ సంభోందించింది? (సీడీపీవో-2013)
ఎ) లాల్ బహదూర్ శాస్త్రి
బి) అంబేద్కర్
సి) విద్యాసాగర్
డి) గాంధీ
- View Answer
- సమాధానం: డి
28. కింది వాటిలో ఏది కుల లక్షణం కాదు?
ఎ) అంతర్వివాహం
బి) వృత్తి అనుబద్ధత
సి) ఛాయ(Colour)
డి) సహపంక్తి భోజన కట్టుబాటు
- View Answer
- సమాధానం: సి
29. ఒక వ్యక్తి కుల సభ్యత్వం దేని ఆధారంగా నిర్ణయిస్తారు?
ఎ) అంతస్తు
బి) సంపద
సి) పుట్టుక
డి) ఆరోగ్యం
- View Answer
- సమాధానం: సి
30. కులం ఒకే _____ సమూహం.
ఎ) బహిర్వివాహిత
బి) సంవృత
సి) అంతర్వివాహిత
డి) అనివార్య
- View Answer
- సమాధానం: సి
31. కులం, వర్గం, అధికారం(Caste, Class and Power) గ్రంథం రచించింది ఎవరు?
ఎ) పి.వి.బెయిలీ
బి) అండ్రె బీటెల్లీ
సి) ఎం.ఎన్. శ్రీనివాస్
డి) హట్టన్
- View Answer
- సమాధానం: బి
32. ఎలాంటి అంటరానితనాన్ని అయినా నిషేధించే ఆర్టికల్ ఏది?
ఎ) ఆర్టికల్-14
బి) ఆర్టికల్-17
సి) ఆర్టికల్-16
డి) ఆర్టికల్-18
33. కుల వ్యవస్థకు చిచిచి స్వభావం ఉంటుంది?
ఎ) క్రమానుగత శ్రేణి(Hierarchical)
బి) సౌష్ఠవ(Symmetrical)
సి) పరస్పర వ్యతిరేక(Contradictory)
డి) సహకార(Co-operative)
- View Answer
- సమాధానం: ఎ
34. కిందివాటిలో కులవ్యవస్థను బలహీన పరచని కారణాలేవి?
ఎ) పారిశ్రామికీకరణ, నగరీకరణ
బి) రవాణా సౌకర్యాలు పెరగడం
సి) రాజ్యాంగం
డి) రిజర్వేషన్ పాలసీ
- View Answer
- సమాధానం: బి
35. కింది వాటిలో కుల వ్యవస్థ లక్షణం కానిది?
ఎ) శుచి- అశుచి
బి) క్రమానుగత శ్రేణి ఆరాధన
సి) క్రమానుగత శ్రేణి
డి) వారసత్వ రీత్యా వచ్చే ప్రత్యేకీకరణ
- View Answer
- సమాధానం: బి
36. కులస్తరీకరణకు ఇది ఆధారం?
ఎ) పునర్జన్మ
బి) వర్ణాశ్రమ వ్యవస్థ - చతుర్వర్ణాలు
సి) పురుషార్థాలు
డి) మత విభాగం
- View Answer
- సమాధానం: బి
37. రుగ్వేదంలో పేర్కొనని వర్ణాలు ఏవి?
ఎ) ఆర్య, శూద్ర వర్ణాలు
బి) ఆర్య, దాస వర్ణాలు
సి) బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలు
డి) క్షత్రియ, శూద్ర వర్ణాలు
- View Answer
- సమాధానం: బి
38. భారతీయ కులవిధానం గురించి ప్రస్తావన మొట్టమొదట దేనిలో కనిపిస్తుంది?
ఎ) మహాభారతం
బి) ఉపనిషత్తులు
సి) వేదాలు
డి) రామాయణం
- View Answer
- సమాధానం: సి
39. క్యాస్ట్(Caste) అనే పదం ఏ భాషలోని కాస్టా(Casta) అనే పదం నుంచి ఆవిర్భవించింది?
ఎ) స్పానిష్, పోర్చుగీసు
బి) జర్మన్
సి) లాటిన్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
40. అస్పృశ్యులు ముందంజ వేయక పోవడానికి కారణం?
ఎ) విజ్ఞాన లేమి
బి) నిరక్షరాస్యత
సి) అల్పులమనే భావన
డి) సంప్రదాయ ధోరణులు
- View Answer
- సమాధానం: సి
41. కుల వ్యవస్థలో లేని అంశం?
ఎ) ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం
బి) శ్రామికులు గతిశీలతను తిరస్కరించడం
సి) వ్యక్తులకు వృత్తులను ఇవ్వడం
డి) సహకారాన్ని అందించడం
- View Answer
- సమాధానం: ఎ
42. కుల వ్యవస్థను బ్రాహ్మణులే, బ్రాహ్మణులకోసం సృష్టించారని పేర్కొన్నవారు?
ఎ) ఆబె దుబాయ్(Abbe Dubois)
బి) జి.ఎస్. ఘుర్యే(G. S. Ghurye)
సి) కేట్కర్
డి) ఎం.ఎన్. శ్రీనివాస్
- View Answer
- సమాధానం: ఎ
43. భారతీయ సమాజంలోని స్తరీకరణ రూపం?
ఎ) సామాజిక వర్గం
బి) అంతస్తు సమూహం
సి) ఎస్టేట్
డి) కులం
- View Answer
- సమాధానం: డి
44. ‘ఒకే పేరును కలిగి, ఒకే పూర్వీకుడి సంతతి అని భావిస్తూ ఒకే సజాతీయ సముదాయంగా మెలుగుతూ ఉండే కొన్ని కుటుంబాల మొత్తమే కులం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) ఎం.ఎన్. శ్రీనివాస్
బి) హెర్బర్ట్ రిస్లే
సి) మెకైవర్
డి) హట్టన్
- View Answer
- సమాధానం: బి
45. వెలికి గురైనవారు(Out castes).. కుల వ్యవస్థాపన ఫలితమే. కుల వ్యవస్థను నిర్మూలిస్తే తప్ప వారిని స్వతంత్రులను చేయలేమని భావించిన వారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) మహాత్మాగాంధీ
సి) కామరాజ్
డి) బి.ఆర్.అంబేద్కర్
- View Answer
- సమాధానం: డి
46. సరైన క్రమాన్ని తెల్పండి?
1) బ్రాహ్మణులు
2) క్షత్రియులు
3) వైశ్యులు
4) శూద్రులు
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2
డి) 2, 1, 3, 4
- View Answer
- సమాధానం:ఎ
47. సంస్కారపరమైన అశుచి(Ritual Pollution)కి ఆధారాలు?
ఎ) జన్మ
బి) శరీరం నుంచే వచ్చే వాసనలు
సి) మరణం
డి) జనన, మరణాలు
- View Answer
- సమాధానం: ఎ
48. కింది వాటిలో సరికానిది?
ఎ) కులం సంస్కృతి వాహకంగాపనిచేస్తుంది
బి) కులం సామాజిక గతిశీలతను ప్రోత్సహిస్తుంది
సి) కులం రాజకీయాలతో ముడిపడి ఉంటుంది
డి) కులం సామాజిక జీవనానికి కావలసిన ప్రకార్యాలను తీరుస్తుంది.
- View Answer
- సమాధానం: బి