గత 75 ఏళ్లలో ‘అత్యంత వేడి సంవత్సరం’గా దేన్ని గుర్తించారు?
1. గత 75 ఏళ్లలో ‘అత్యంత వేడి సంవత్సరం’గా దేన్ని గుర్తించారు?
ఎ) 2015
బి) 2013
సి) 2012
డి) 2011
- View Answer
- సమాధానం: ఎ
2. ‘ప్రపంచ చిత్తడి నేలల దినం’గా దేన్ని పాటిస్తారు?
ఎ) ఫిబ్రవరి 2
బి) జూన్ 5
సి) సెప్టెంబర్ 16
డి) డిసెంబర్ 21
- View Answer
- సమాధానం: ఎ
3. సిగరెట్ పొగలో ఉండే రేడియోధార్మిక పదార్థం ఏది?
ఎ) రేడాన్
బి) రేడియం
సి) పొలోనియం
డి) యురేనియం
- View Answer
- సమాధానం: సి
4. కేన్సర్‌కు కారణమయ్యే భార లోహం ఏది?
ఎ) సీసం
బి) ఆర్సెనిక్
సి) కాడ్మియం
డి) పాదరసం
- View Answer
- సమాధానం: బి
5. కింది వాటిలో ‘రాతికుష్ఠు’(Stone Leprosy)కు సంబంధించిన కాలుష్య కారకం ఏది?
ఎ) మీథేన్
బి) నైట్రస్ ఆక్సైడ్
సి) సల్ఫర్ డై ఆక్సైడ్
డి) పర్ఫ్లోరోకార్బన్
- View Answer
- సమాధానం: సి
6. ‘కార్టజీనా ప్రోటోకాల్’ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2003
బి) 2004
సి) 2005
డి) 2006
- View Answer
- సమాధానం: ఎ
7. భారత్‌లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ-వేస్ట్) అత్యధికంగా ఏ నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి?
ఎ) ముంబయి
బి) ఢిల్లీ
సి) బెంగళూరు
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: ఎ
8. కింది వాటిలో ఆర్గానో క్లోరినేటెడ్ క్రిమి సంహారకం ఏది?
ఎ) మాలాథియాన్
బి) ఫాస్ఫామిడాన్
సి) పారాథియాన్
డి) ఎండోసల్ఫాన్
- View Answer
- సమాధానం: డి
9. ‘నాక్-నీ సిండ్రోమ్’గా దేన్ని పేర్కొంటారు?
ఎ) సిడరోసిస్
బి) ఫ్లోరోసిస్
సి) ఆస్టియోమలేసియా
డి) ఆస్టియోఫోరోసిస్
- View Answer
- సమాధానం: బి
10. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునే భార లోహం ఏది?
ఎ) క్రోమియం
బి) కాడ్మియం
సి) సీసం
డి) పాదరసం
- View Answer
- సమాధానం: సి
11. నగరాల్లో ఏ తీవ్రత కంటే తక్కువగా ఉన్న శబ్దాన్ని సురక్షిత స్థాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది?
ఎ) 45 డెసిబెల్స్
బి) 80 డెసిబెల్స్
సి) 55 డెసిబెల్స్
డి) 90 డెసిబెల్స్
- View Answer
- సమాధానం: ఎ
12. చమురు వ్యర్థ పదార్థాల శుద్ధికి తోడ్పడే సూక్ష్మజీవుల మిశ్రమాలైన ‘అయిల్జాపర్’, ‘అయిల్ వోరస్’ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
ఎ) నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
బి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం
సి) ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్
డి) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
- View Answer
- సమాధానం: సి
13. జీవితకాలం పూర్తై ‘కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్’ వల్ల ఏ భార లోహ కాలుష్యం సంభవిస్తోంది?
ఎ) ఆర్సెనిక్
బి) పాదరసం
సి) సీసం
డి) నికెల్
- View Answer
- సమాధానం: బి
14. ఎల్సీడీ మానిటర్ల వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా అధిక మొత్తంలో లభించే లోహం ఏది?
ఎ) గాలియం
బి) బంగారం
సి) ఇండియం
డి) వెండి
- View Answer
- సమాధానం: డి
15. ఓజోన్ పొర సంరక్షణ కోసం అమల్లో ఉన్న అంతర్జాతీయ ఒప్పందం ఏది?
ఎ) మాంట్రియాల్ ప్రోటోకాల్
బి) క్యోటో ప్రోటోకాల్
సి) రామ్సార్ కన్వెన్షన్
డి) కార్టజీనా ప్రోటోకాల్
- View Answer
- సమాధానం: ఎ
16. ‘క్యోటో ప్రోటోకాల్’ కింది వాటిలో దేన్ని ‘గ్రీన్హౌస్ వాయువు’గా గుర్తించలేదు?
ఎ) మీథేన్
బి) సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్
సి) పర్ఫ్లోరోకార్బన్
డి) సల్ఫర్ డై ఆక్సైడ్
- View Answer
- సమాధానం: డి
17. ‘ఎనిమిక్ హైపోక్సియా’కు కారణమయ్యే వాయు కాలుష్య కారకం ఏది?
ఎ) CO2
బి) CO
సి) SO2
డి) NO2
- View Answer
- సమాధానం: బి
18. తాగే నీటిలో నైట్రేట్లు అధికంగా ఉండటం వల్ల చిన్నారుల్లో ఏ వ్యాధి వస్తుంది?
ఎ) క్రి-దు-చాట్ సిండ్రోమ్
బి) డౌన్స్ సిండ్రోమ్
సి) బ్లూ బేబీ సిండ్రోమ్
డి) ఎడ్వర్డ్ సిండ్రోమ్
- View Answer
- సమాధానం: సి
19.‘ఇటాయి-ఇటాయి’ వ్యాధి ఏ లోహ కాలుష్య కారణంగా వస్తుంది?
ఎ) పాదరసం
బి) సీసం
సి) క్రోమియం
డి) కాడ్మియం
- View Answer
- సమాధానం: డి
20.తాగే నీటిలో ఉండే ఏ సూక్ష్మజీవి కాలుష్య సూచీగా వ్యవహరిస్తుంది?
ఎ) ఎంటమీబా
బి) విబ్రియో కలరా
సి) ఎశ్చరీషియా కొలై
డి) సాల్మోనెల్లా టైఫీ
- View Answer
- సమాధానం: సి
21. ‘న్యూక్లియర్ వాటర్’ అంటే అర్థమేమిటి?
ఎ) అణు యుద్ధం
బి) అణు యుద్ధం ద్వారా సంభవించే వాతావరణం
సి) ప్రపంచంలో అణ్వస్త్రాలు అధికమవడం
డి) అణ్వాయుధాలను పరీక్షించడం
- View Answer
- సమాధానం: బి
22.ఎజెండా - 21 దేనికి సంబంధించింది?
ఎ) జీవ వైవిధ్య సంరక్షణ
బి) సుస్థిర అభివృద్ధి
సి) శీతోష్ణస్థితి మార్పు
డి) ఓజోన్ పరిరక్షణ
- View Answer
- సమాధానం: బి
23. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటిలోగా చేరుకోవాలని నిర్దేశించారు?
ఎ) 2020
బి) 2025
సి) 2030
డి) 2050
- View Answer
- సమాధానం: సి
24. ఆధునిక వ్యవసాయం కింది వాటిలో దేనికి దారి తీయదు?
ఎ) నైట్రేట్ కాలుష్యం
బి) యూట్రిఫికేషన్
సి) బయోమ్యాగ్నిఫికేషన్
డి) ఓజోన్ పొర క్షీణత
- View Answer
- సమాధానం: డి
25. ‘బ్రండ్టల్యాండ్ నిర్వచనం’లోని మూడు అంశాలేవి?
ఎ) అభివృద్ధి, అవసరాలు, భవిష్యత్తుతరాలు
బి) అభివృద్ధి, అవసరాలు, ప్రస్తుత- భవిష్యత్తు తరాలు
సి) అభివృద్ధి, అవసరాలు, ప్రస్తుత తరాలు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: బి
26. సుస్థిరాభివృద్ధి ఎక్కువగా వేటి వినియోగంపై దృష్టి సారిస్తుంది?
ఎ) పునర్వినియోగ వనరులు
బి) నిర్జీవ వనరులు
సి) వ్యవసాయ వనరులు
డి) సహజ వనరులు
- View Answer
- సమాధానం: ఎ
27. మానవ అభివృద్ధి సూచీ-2015లో భారత్ స్థానం ఎంత?
ఎ) 135
బి) 130
సి) 125
డి) 120
- View Answer
- సమాధానం: బి
28.‘రియో + 20’ సదస్సును ఎప్పుడు నిర్వహించారు?
ఎ) 2012 జూన్
బి) 1992 జూన్
సి) 2015 జూన్
డి) 2010 జూన్
- View Answer
- సమాధానం: ఎ
29. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీ- 2015లో భారత్ కంటే ముందున్న దేశం ఏది?
ఎ) బంగ్లాదేశ్
బి) శ్రీలంక
సి) నేపాల్
డి) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: బి
30. 2016 జూలైలో విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ స్థానం?
ఎ) 56
బి) 110
సి) 115
డి) 139
- View Answer
- సమాధానం: బి
31. ‘ఎజెండా 21’లో 21 దేన్ని సూచిస్తుంది?
ఎ) 21 లక్ష్యాలు
బి) 21వ శతాబ్దం
సి) 21 దేశాలు
డి) 21 ఏళ్లు
- View Answer
- సమాధానం: బి
32. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 ఎజెండాకు సంబంధించిన నినాదం ఏది?
ఎ) ది ఫ్యూచర్ వియ్ వాంట్
బి) అవర్ కామన్ ఫ్యూచర్
సి) ట్రాన్సఫార్మింగ్ అవర్ వరల్డ్
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: సి
33. సోషల్ ప్రోగ్రెస్ సూచీ-2015లో మొదటిస్థానం ఏ దేశానికి లభించింది?
ఎ) నార్వే
బి) స్వీడన్
సి) స్విట్జర్లాండ్
డి) కెనడా
- View Answer
- సమాధానం: ఎ
34. తొలిసారిగా ‘సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్’ను ఏ సంవత్సరంలో విడుదల చేశారు?
ఎ) 2013
బి) 2014
సి) 2015
డి) 2016
- View Answer
- సమాధానం: బి
35."A Sand County Almanac" గ్రంథ రచయిత ఎవరు?
ఎ) ఆల్డో లియోపోల్డ్
బి) హెన్రీ డేవిడ్ థోరియో
సి) రాచెల్ కార్సన్
డి) బెంజిమన్ ఫ్రాంక్లిన్
- View Answer
- సమాధానం: ఎ
36. గ్రో హార్లెం బ్రండ్టలాండ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు?
ఎ) కెనడా
బి) నార్వే
సి) స్వీడన్
డి) డెన్మార్క్
- View Answer
- సమాధానం:బి
37. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది ఏది?
ఎ) పేదరిక నిర్మూలన
బి) ఆకలి నిర్మూలన
సి) అందరికీ ఆరోగ్యం
డి) నాణ్యమైన విద్య
- View Answer
- సమాధానం: ఎ
38.సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్-2015లో భారత్ స్థానం ఎంత?
ఎ) 101
బి) 102
సి) 103
డి) 104
- View Answer
- సమాధానం: ఎ
39. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించిన తేదీ?
ఎ) 2015 సెప్టెంబరు 25
బి) 2015 డిసెంబరు 25
సి) 2016 మార్చి 31
డి) 2016 జూలై 1
- View Answer
- సమాధానం: ఎ
40. సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్‌ను రూపొందించినవారెవరు?
ఎ) మైకేల్ పోర్టర్
బి) స్కాట్ టెర్న్
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
41. భారత జనాభాలో 65 ఏళ్ల వయసు పైబడిన వారి శాతం ఎంత?
ఎ) 5.2%
బి) 18%
సి) 13.5%
డి) 16.6%
- View Answer
- సమాధానం: ఎ
42. భారత జనాభాలో అధిక శాతం (28 శాతం) ఏ వయసువారు ఉన్నారు?
ఎ) 1 14 ఏళ్లు
బి) 15 24 ఏళ్లు
సి) 25 34 ఏళ్లు
డి) 35 44 ఏళ్లు
- View Answer
- సమాధానం: ఎ
43.భారత జనాభాలో 45 64 ఏళ్ల లోపు ఎంత శాతం మంది ఉన్నారు?
ఎ) 13.5%
బి) 18%
సి) 16.6%
డి) 18.4%
- View Answer
- సమాధానం: బి
44. ప్రపంచ జనాభాలో భారత్ వాటా ఎంత వాతం?
ఎ) 16%
బి) 17.5%
సి) 30%
డి) 40%
- View Answer
- సమాధానం: బి
45. ‘క్లబ్ ఆఫ్ రోమ్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ) 1962
బి) 1968
సి) 1972
డి) 1992
- View Answer
- సమాధానం: బి
46. ‘రియో + 5’ సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు?
ఎ) 1997
బి) 1999
సి) 2002
డి) 2005
- View Answer
- సమాధానం: ఎ
47. 2016 జూలైలో విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో అమెరికా స్థానం ఎంత?
ఎ) 25
బి) 47
సి) 76
డి) 5
- View Answer
- సమాధానం: ఎ
48.సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో మొత్తం ఎన్ని అంశాలను పేర్కొన్నారు?
ఎ) 7
బి) 8
సి) 9
డి) 10
- View Answer
- సమాధానం: బి
49. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీలో లేని అంశం ఏది?
ఎ) నవజాత శిశు మరణాలు
బి) సగటు జీవితకాలం
సి) విద్య
డి) తలసరి ఆదాయం
- View Answer
- సమాధానం: డి