‘బయోటెక్నాలజీ’ (జీవ సాంకేతిక శాస్త్రం) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1. ‘బయోటెక్నాలజీ’ (జీవ సాంకేతిక శాస్త్రం) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు?
1) జాన్కోల్ రీటర్
2) వాక్స్మెన్
3) కార్ల ఎరికే
4) లీవెన్ హక్
- View Answer
- సమాధానం: 3
2. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) ‘డాలి’.. ప్రపంచంలో మొదటిసారిగా సృష్టించిన క్లోన్డ్ గొర్రెపిల్ల. దీన్ని ‘రోసేలిన్ ఇన్స్టిట్యూట్’ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ సృష్టించారు
బి) ‘ఈవ్’.. మొదటి క్లోన్డ్ బేబీ. దీన్ని సృష్టించిన సంస్థ ‘సియోల్ నేషనల్ యూనివర్సిటీ’
సి) సంరూప, గరిమా అనే పెయ్య దూడలను సృష్టించింది నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), కర్నాల్ (హర్యానా)
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
3. ‘ఇంటర్ఫెరాన్’లను ప్రధానంగా ఏ జీవులు ఉత్పత్తి చేస్తాయి?
1) అకశేరుకాలు
2) సకశేరుకాలు
3) బ్యాక్టీరియాలు
4) శిలీంధ్రాలు
- View Answer
- సమాధానం: 2
4. ఇంటర్ఫెరాన్లను కనుగొన్నవారు?
1) గిల్బర్ట్, వీస్మన్
2) కోహ్లర్, మిల్స్టీన్
3) నాథన్స్
4) థామ్సన్
- View Answer
- సమాధానం: 1
5. కిందివాటిలో జన్యు పరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) వరిలో IR - 8
2) గోల్డెన్ రైస్
3) సజ్జలో పూసా మోతి
4) వేరుశనగలో TMV - 3
- View Answer
- సమాధానం: 2
6. కిందివాటిలో ‘బ్యాక్టీరియల్ పెస్టిసైడ్’ ఏది?
1) బాసిల్లస్ ఆంథ్రాసిస్
2) బాసిల్లస్ ఫాలిమిక్సా
3) క్లాస్ట్రీడియం బొట్సులినమ్
4) బాసిల్లస్ థురింజియాన్సిస్
- View Answer
- సమాధానం: 4
7. ‘తైపేయి’ అనేది ఏ పంట రకం?
1) జొన్న
2) గోధుమ
3) వరి
4) సజ్జ
- View Answer
- సమాధానం: 3
1) వరిలోని పూసా రకాన్ని IP-8 రకంతో సంకరణం చేయడం ద్వారా
2) తైపేయి అనే వరి రకంలో 'విటమిన్-ఎ' ను ఉత్పత్తి చేసే మూడు జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
3) అధిక దిగుబడిని సాధించడానికి వరిలోని 'అనామిక' రకంలోకి జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా
4) వరిలోని 'బీరాజ్' రకంలో ఉత్పరివర్తనాలను కలిగించడం ద్వారా
- View Answer
- సమాధానం: 2
9. సూక్ష్మజీవులను ఉపయోగించి.. నేల లేదా నీటి నుంచి అనవసర వ్యర్థ పదార్థాలు, కాలుష్య కారకాలను తొలగించే పద్ధతిని ఏమంటారు?
1) బయోఇన్ఫర్మేటిక్స్
2) ప్రోటియోమిక్స్
3) బయోరెమిడియేషన్
4) జీనోమిక్స్
- View Answer
- సమాధానం: 3
10. జున్ను ఉత్పత్తికి ఉపయోగించే జంతు ఎంజైమ్ ఏది?
1) పపేన్
2) రెన్నెట్
3) లైపాక్సిజినేజ్
4) లైపేజ్
- View Answer
- సమాధానం: 2
11. మాంసం మృదుత్వానికి, తోళ్లను మెత్తబరచడానికి ఉపయోగించే ఎంజైమ్‌లు వరసగా?
1) పపేన్, రెన్నెట్
2) పపేన్, ప్రోటియేజ్
3) ప్రోటియేజ్, ట్రిప్సిన్
4) రెన్నెట్, లైపేజ్
- View Answer
- సమాధానం: 2
12. 'గోల్డెన్ రైస్' ను సృష్టించిన శాస్త్రవేత్త?
1) కొహ్లెర్
2) నాథన్స్
3) నార్మన్ బోర్లాగ్
4) ఇంగోపాట్రికుస్
- View Answer
- సమాధానం: 4
13. కిందివాటిలో జన్యుపరివర్తిత మొక్కకు ఉదాహరణ?
1) బంగారు వరి
2) బంగారు వేరుశనగ
3) బి.టి. పత్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
14.కణజాలవర్ధనం (టిష్యూ కల్చర్) ప్రధానంగా ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) కణ సిద్ధాంతం
2) సెల్యులార్ టోటిపొటెన్సీ
3) కణ వంశానుక్రమ సిద్ధాంతం
4) ఆమ్నిస్ సెల్యులా - ఇ - సెల్యులా
- View Answer
- సమాధానం: 2
15. 'సెల్యులార్ టోటిపొటెన్సీ' అంటే..?
1) ఒక కణం క్షయకరణ విభజన చెందగలిగే శక్తి
2) సరైన నియంత్రణ పరిస్థితుల్లో.. ఆక్సిన్ - సైటోకైనిన్‌లను ఉపయోగించి ప్రకాండ వ్యవస్థను ప్రేరేపించడం
3) అతి శీతల అభిచర్య జరిపి ఒక మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించడం
4) అనుకూల పరిస్థితుల్లో కొత్త మొక్కను ఏర్పర్చగలిగే కణం అంతర్గత సామర్థ్యం
- View Answer
- సమాధానం: 4
16. తొలిసారిగా 'టోటిపొటెన్సీ' అనే పదాన్ని ఉపయోగించినవారు?
1) మోర్గాన్
2) స్టీవార్డ్
3) ముల్లర్
4) హేబర్ లాండ్
- View Answer
- సమాధానం: 1
17. 'కణజాలవర్ధన పితామహుడు' ఎవరు?
1) ఎఫ్.సి. స్టీవార్డ్
2) మోర్గాన్
3) హేబర్ లాండ్
4) ముల్లర్
- View Answer
- సమాధానం: 3
18. కణజాలవర్ధనంలో యానకం pH విలువ ఏ విధంగా ఉండాలి?
1) 3.0 - 5.0
2) 7.2 - 8.0
3) 5.6 - 6.0
4) 6.3 - 7.4
- View Answer
- సమాధానం: 3
19. కణజాలవర్ధనంలో ఎక్కువగా ఉపయోగించే యానకం ఏది?
1) B.S. యానకం
2) S.M. యానకం
3) M.S. యానకం
4) L.S. యానకం
- View Answer
- సమాధానం: 3
20. మౌలిక (బేసిక్) యానకంలో లోపించేవి?
1) సూక్ష్మ మూలకాలు
2) విటమిన్లు
3) కార్బొహైడ్రే ట్లు
4) వృద్ధి నియంత్రకాలు
- View Answer
- సమాధానం: 4
21. కణజాలవర్ధనంలో ఏర్పడే ‘అవయవ విభేదనం’ చెందని కణాల సముదాయాన్ని ఏమంటారు?
1) కాలస్
2) కాలోస్
3) క్లోన్
4) ఎక్స్‌ప్లాంట్
- View Answer
- సమాధానం: 1
22. ‘సోడియం ఆల్జినేట్’తో రక్షణ కవచాలను ఏర్పర్చి, గుళికలుగా మార్చే నిర్మాణాలను ఏమంటారు?
1) ప్లాస్మిడ్లు
2) ప్లాస్టిడ్లు
3) సంశ్లేషిత/ కృత్రిమ విత్తనాలు
4) సైటోప్లాస్ట్లు
- View Answer
- సమాధానం: 3
23.జతపరచండి.
జాబితా - I
a) సోడియం హైపోక్లోరైట్
b) మెర్క్యురిక్ క్లోరైడ్
c) సోడియం ఆల్జినేట్
d) సాయిల్ రైట్
జాబితా - II
i) విత్తనాల ఉపరితలాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం
ii) వర్ధనం చేసిన మొక్కలను నాటడం
iii) ఎక్స్‌ప్లాంట్‌ను సూక్ష్మజీవరహితం చేయడం
vi) పిండాలను గుళికలుగా మార్చడం
a b c d
1) iii i iv ii
2) iii i ii iv
3) iv ii iii i
4) i iii ii iv
- View Answer
- సమాధానం: 1
24. జతపరచండి.
జాబితా - I
a) సోమాక్లోనల్ వైవిధ్యాలు
b) సూక్ష్మ వ్యాప్తి
c) శాఖీయ పిండోత్పత్తి
d) అక్లిమటైజేషన్ (వాతావరణానుకూలత)
జాబితా - II
i) కాలస్ నుంచి పిండాల లాంటి నిర్మాణాల అభివృద్ధి
ii) కణజాలవర్ధనంలో ఏర్పడిన మొక్క ప్రదర్శించే వైవిధ్యాలు
iii) కణజాలవర్ధనం ద్వారా పెద్దమొత్తంలో తక్కువ స్థలంలో మొక్కలను ఉత్పత్తిచేయడం
iv) కణజాలవర్ధనం ద్వారా ఏర్పడిన మొక్కలు వాతావరణ అనుకూలతను ప్రదర్శించడం
a b c d
1) ii iii iv i
2) ii iii i iv
3) i ii iii iv
4) ii i iii iv
- View Answer
- సమాధానం: 2
25. కిందివాటిలో సరైన వరస క్రమం ఏది?
ఎ) బయోపెస్టిసైడ్ - బాసిల్లస్ థురింజి యాన్సిస్ - మాంసం మృదుత్వానికి ఉపయోగపడుతుంది
బి) బాక్యులో వైరస్ - ఎన్. పి. వి. - ఆర్థ్రోపాడ్ కీటకాలను వ్యాధిగ్రస్థం చేస్తుంది
సి) వరిలో తైపేయి రకం - గోల్డెన్ రైస్ - విటమిన్-ఎ ను ఉత్పత్తి చేస్తుంది
డి) బీటీ పత్తి - బీటీ విషపదార్థం - తోళ్లను మెత్తబరుస్తుంది
1) ఎ, బి
2) సి, డి
3) బి, సి
4) ఎ, డి
- View Answer
- సమాధానం: 3
26. జతపరచండి.
జాబితా - I
a) బయోఇన్ఫర్మేటిక్స్
b) బయోరె మిడియేషన్
c) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్
d) జన్యు థెరపీ
జాబితా - II
i) సూక్ష్మజీవులను ఉపయోగించికాలుష్యాన్ని తొలగించడం
ii) నేరస్థులను, వ్యక్తి అసలైన తల్లిదండ్రులను గుర్తించడం
iii) జన్యు సంబంధ వ్యాధుల నిర్ధారణ
iv) జీవశాస్త్ర అధ్యయనానికి తోడ్పడే సమాచార సాంకేతిక శాస్త్రం
a b c d
1) i ii iii iv
2) iv i ii iii
3) iv i iii ii
4) iii ii i iv
- View Answer
- సమాధానం: 2
27. మొదటిసారిగా ‘కృత్రిమ గర్భధారణ’ (ఐ.వి.ఎఫ్.) పద్ధతి ద్వారా ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ (లూయిస్ బ్రౌన్)ను సృష్టించినవారు?
1) ఫిరోజ్ ఫారిక్
2) లాల్జీసింగ్
3) రాబర్ట్ ఎడ్వర్డ్ - ప్యాట్రిక్ స్టెప్టో
4) ష్లైడన్ - ష్వాన్
- View Answer
- సమాధానం: 3
28. ‘డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ పితామహుడు’ గా ఎవరిని పేర్కొంటారు?
1) అలెక్ జెఫ్రీస్
2) రాబర్ట్ ఎడ్వర్డ్
3) నాథన్స్
4) ఎఫ్.సి. స్టీవార్డ్
- View Answer
- సమాధానం: 1
29. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
ఎ) జీవరాశులు, మొక్కల నుంచి తయారు చేసిన ఇంధనాలను ‘జీవ ఇంధనాలు’(బయోఫ్యుయల్స్) అంటారు
బి) మొక్కల విత్తనాల నుంచి లభించే నూనెలను ‘ట్రాన్స్ ఎస్టరిఫికేషన్’ ప్రక్రియకు గురిచేసినప్పుడు బయోడీజిల్ లభిస్తుంది
సి) బయోడీజిల్‌ను పెట్రోల్‌తో కలిపే ప్రక్రియను ‘బ్లెండింగ్’ అంటారు
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4