వాతావరణ మార్పు ప్రగతి సూచీ 2019లో భారత్ స్థానం?
పర్యావరణ ప్రగతి సూచీ 2018లో భారత్ చివరి నుంచి నాలుగో దేశంగా నిలిచింది. ప్రపంచంలో పర్యావరణ అంశాలపరంగా రూపొందించిన ఈ సూచీలో మొత్తం 180 దేశాలకుగాను భారత్ 177వ స్థానం పొందింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బంగ్లాదేశ్, బురిండి కంటే పర్యావరణ ప్రగతిలో భారత్ ముందంజలో ఉంది. ఈ స్థితి భారత్‌లో వాయు నాణ్యతను మెరుగుపరచుకోవడంతో పాటు, జీవవైవిధ్య పరిరక్షణ, గ్రీన్ హౌజ్ గ్యాస్ ఉద్గారాల తగ్గింపులాంటి అంశాల ఆవశ్యకతను తెలుపుతుంది. భారత్, చైనాలు ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పర్యావరణ ప్రగతి నివేదిక వెల్లడించింది. భారత్, చైనాల ఆర్థికాభివృద్ధి సాధనకు అవలంభిస్తున్న పద్ధతుల కారణంగా పర్యావరణ క్షీణత సంభవిస్తుంది. పర్యావరణ ఆరోగ్య విధానాల లక్ష్యంలో అల్ప ప్రగతి కారణంగా భారత్ ఈ సూచీలో మెరుగైన స్థితిని కనబర్చలేకపోయింది. ఈ సూచీలో స్విట్జర్లాండ్, ఫ్రాన్స, డెన్మార్క, మాల్టా, స్వీడన్లు మొదటి ఐదు స్థానాలు పొందాయి. వాతావరణం, శక్తి, వాయు కాలుష్యం కేటగిరీల్లో స్విట్జర్లాండ్ అధిక స్కోరు సాధించింది. నీరు, పారిశుద్ధ్యం కేటగిరీల్లో మాల్టా అధిక స్కోరు సాధించగా, పర్యావరణ ఆరోగ్యంలో భాగంగా వాయు నాణ్యత కేటగిరీ విషయంలో డెన్మార్క, మాల్టా, స్వీడన్లు అధిక స్కోరు సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్య పారిశ్రామిక దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాలతో పోలిస్తే ఈ సూచీలో అమెరికా వెనుకంజలో ఉంది.
- వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘నేషనల్ క్లీన్ ఎయిర్’ కార్యక్రమంలో భాగంగా PAN India Air Pollution abatement' పథకాన్ని 102 నగరాల్లో ప్రారంభించింది. 2024 నాటికి వాయు కాలుష్యంలో 30 శాతం తగ్గుదలను సాధించాలని ప్రభుత్వం లక్ష్యం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు, జర్మన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఫ్రెంచ్ ఫండింగ్ ఏజెన్సీ, స్విస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్లూంబర్గ Philonthropies లాంటి అంతర్జాతీయ ఏజెన్సీ నుంచి ఈ పథకానికి ఆర్థిక సహాయం లభిస్తుంది.
- ప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా, థాయ్‌లాండ్, బ్రిటన్లు అనేక చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఒకసారి వినియోగానికి పనికి వచ్చే ఆరు ప్లాస్టిక్ ఉత్పత్తులను భారత ప్రభుత్వం నిషేదిస్తుంది. 2022 నాటికి ఒకసారి వినియోగానికి పనికి వచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాలిథీన్ సంచులను నిషేధించాయి. ఆరు ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం భారత్‌లో ప్రస్తుతం సంవత్సరానికి 14 మిలియన్ టన్నులు. దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తుల తగ్గింపు సంబంధించి వినియోగదారుల్లో అవగాహన కల్పించడానికి థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటానికి బ్రిటన్ ప్రభుత్వం, యూఎన్ఈపీ ఇప్పటికే చేపట్టిన ‘Tide Turners Plastic Challenge Badge’ను విస్తరించాలని భావిస్తున్నాయి. భారత్‌లో ఎయిర్ పోర్ట అథారిటీ ఆఫ్ ఇండియా 129 విమానాశ్రయాల్లో ఒకసారి వినియోగానికి పనికివచ్చే ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది.
- కాలుష్యం దేశస్థూల దేశీయోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాయు కాలుష్యం కారణంగా సంక్షేమంపై వ్యయం పెరిగినందుకు 2013లో భారత్ జి.డి.పి.లో 8.5 శాతం కోల్పోయినట్లు ప్రపంచ బ్యాంకు అధ్యయనం తెలుపుతుంది. వాయు కాలుష్యం కారణంగా 2015లో ముంబై, ఢిల్లీలలో రూ.70 వేల కోట్ల వ్యయం జరిగింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనం ప్రకారం అల్పాభివృద్ధి దేశాల్లో కాలుష్యం కారణంగా ఆర్థిక ఉత్పత్తిలో సాంవత్సరిక తగ్గుదల 2 శాతం. 2017లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ అభిప్రాయంలో కాలుష్య సంబంధిత మరణాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 2015లో కాలుష్య సంబంధిత మరణాల్లో 9 మిలియన్లు కాగా, ఈ మొత్తంలో భారత్ వాటా 2.5 మిలియన్లు. కాలుష్య సంబంధిత మరణాల పెరుగుదల అధికంగా ఇండియా, బంగ్లాదేశ్‌ల్లో నమోదైంది. మధ్య ఆదాయ దేశాల్లో కాలుష్యం కారణంగా సాంవత్సరిక ఆరోగ్య సంరక్షణ వ్యయంలో 7 శాతం పెరిగింది. కాలుష్యం కారణంగా అనేక వ్యాధులకు ప్రజలు గురవుతున్నప్పుడు ఆర్థిక వ్యయంలో పెరుగుదల ఏర్పడుతుంది. పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా వర్షపాత ప్రక్రియలో మార్పులు సంభవిస్తాయి. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొనే చర్యల కారణంగా ఉత్పాదకత పెరిగి ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి.
1. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల నిర్వహణకు కింది ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1) స్వచ్ఛత హి సేవ 2019
2) స్వచ్ఛ భారత్ మిషన్
3) ఆయుష్మాన్ భారత్
4) గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమం
- View Answer
- సమాధానం: 1
2. భారత్‌లో త్వరలో మొదటి ‘Garbage cafe’ను ఏ నగరంలో ప్రారంభిస్తారు?
1) కోల్‌కతా
2) భోపాల్
3) అంబికాపూర్
4) పుణే
- View Answer
- సమాధానం: 3
3. అధిక సంఖ్యలో గొట్టపు బావులను ఉన్న దేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) ఇండియా
3) శ్రీలంక
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
4. పర్యావరణ ప్రగతి సూచీ 2018 రూపొందించింది ఎవరు?
1) వరల్డ్ ఎకనమిక్ ఫోరం సహకారంతో యేల్, కొలంబియన్ విశ్వవిద్యాలయాలు
2) హెరిటేజ్ ఫౌండేషన్
3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
4) యూనిసెఫ్
- View Answer
- సమాధానం: 1
5.వాతావరణ మార్పు ప్రగతి సూచీ 2019లో భారత్ స్థానం?
1) 9
2) 10
3) 11
4) 17
- View Answer
- సమాధానం: 3
6. ఎన్విరాన్మెంటల్ డెమోక్రసీ ఇండెక్స్‌ను రూపొందించింది ఎవరు?
1) యు.ఎన్.డి.పి.
2) వరల్డ్ రిసోర్స ఇన్స్టిట్యూట్
3) కొలంబియా విశ్వవిద్యాలయం
4) హార్వర్డ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
7. ఇండియన్ రైల్వేలో గ్రీన్ ఇనిషియేటివ్‌స కల్పనకు రైల్వే మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం చేసుకుంది?
1) కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్
2) హెరిటేజ్ ఫౌండేషన్
3) ప్రపంచ ఆర్థిక సమాఖ్య
4) ప్రపంచ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
8. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌ను రూపొందించింది ఎవరు?
1) బ్రిటిష్ మెడికల్ జర్నల్
2) యు.ఎన్. ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్
3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 3
9. జీవావరణ వ్యవస్థ అనే పదాన్ని 1935లో మొదటిసారి ఉపయోగించింది ఎవరు?
1) మార్షల్
2) ఎ.జి. టాన్లె
3) ఆడం స్మిత్
4) రాబిన్ సన్
- View Answer
- సమాధానం: 2
10. మొత్తం సమాజానికి సంబంధించిన వస్తువులను ఎలా పరిగణిస్తాం?
1) పబ్లిక్ వస్తువులు
2) ప్రైవేటు వస్తువులు
3) ఉమ్మడి వస్తువులు
4) సాంఘిక వస్తువులు
- View Answer
- సమాధానం: 4
11.ప్రపంచ పర్యావరణ ప్రగతి సూచీ 2018లో భారత్ స్థానం ఎంత?
1) 157
2) 167
3)177
4) 179
- View Answer
- సమాధానం: 3
12. The Legatum prosperity index 2018లో మొత్తం 149 దేశాలకు సంబంధించి భారత్ స్థానం ఎంత?
1) 25
2) 32
3) 42
4) 94
- View Answer
- సమాధానం: 4
13. పర్యావరణ మంత్రిత్వ శాఖకు 2019-20 కేంద్ర బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత?
1) రూ.1954 కోట్లు
2) రూ.2954 కోట్లు
3) రూ.3054 కోట్లు
4) రూ.4954 కోట్లు
- View Answer
- సమాధానం: 2
14. దోహ (Doha) సవరణ కింది వాటిలో దేనికి సంబంధించింది?
1) క్యోటో ప్రొటోకాల్
2) పర్యావరణం
3) ప్రభుత్వ బడ్జెట్లు
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
15. కింది వాటిలో పునరుద్ధరించలేని వనరు ఏది?
ఎ. ఖనిజాలు
బి. చమురు
సి. బొగ్గు
డి. నీరు
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, బి, సి
4) సి, డి
- View Answer
- సమాధానం: 3
16. మనం నివసించే ప్రదేశం, పీల్చే గాలి, తినే ఆహారం, తాగునీరు, ఉపయోగించే ఇతర వనరులు పర్యావరణం నుంచి లభిస్తాయని పేర్కొంది ఎవరు?
1) సి.సి. పార్మ
2) కె. ఆర్. దీక్షిత్
3) మార్షల్
4) విన్పెన్
- View Answer
- సమాధానం: 2
17. పర్యావరణ నాణ్యత స్థాయికి కొలమానంగా సైమన్ కుజ్నట్ కింది వాటిలో దేనిని పేర్కొన్నారు?
1) అడవుల నరికివేత
2) భూసార క్షీణత
3) నేల కాలుష్యం
4) నీటి కాలుష్యం
- View Answer
- సమాధానం: 1
18. ఆర్థికాభివృద్ధిని బహుముఖ ‘అభివృద్ధి - ప్రక్రియ’గా వర్ణించింది ఎవరు?
1) పాల్ శామ్యుల్ సన్
2) కాల్డర్
3) మైఖేల్.పి. టొడారో
4) పిగూ
- View Answer
- సమాధానం: 3
19.మొదటి గనుల చట్టం భారత్‌లో ఏ సంవత్సరంలో ప్రకటించారు?
1) 1858
2) 1901
3) 1917
4) 1948
- View Answer
- సమాధానం: 2
20. జీవ వైవిధ్యంపై 1992లో బ్రెజిల్‌లోని ఏ ప్రాంతంలో సదస్సు నిర్వహించారు?
1) OLINDA
2) BONITO
3) రియోడిజెనీరో
4) అమెజాన్
- View Answer
- సమాధానం: 3
21. కాలుష్య నివారణ పథకాలకు 2019-20 కేంద్ర బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు?
1) రూ.460 కోట్లు
2) రూ.750 కోట్లు
3) రూ.970 కోట్లు
4) రూ.980 కోట్లు
- View Answer
- సమాధానం: 1
22.కిగాలి సవరణ దేనికి సంబంధించింది?
1) క్యోట్ ప్రొటోకాల్
2) ఇంటర్నెట్ ప్రొటోకాల్
3) మాంట్రియల్ ప్రొటోకాల్ సవరణ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
23. క్యోటో ప్రొటోకాల్ ఒప్పందంపై భారత్ ఎప్పుడు సంతకం చేసింది?
1) 1998 జూన్
2) 2002 ఆగస్టు
3) 2004 ఆగస్టు
4) 2005 ఆగస్టు
- View Answer
- సమాధానం: 2
24. ఎర్త సమ్మిట్ ఫలితంగా కింది వాటిలో ఏర్పాటైంది ఏది?
1) యూన్ఎఫ్సీసీ
2) యునెస్కో
3) వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశం ఏది?
ఎ. జనాభా వృద్ధిరేటు
బి. సహజ వనరుల లభ్యత
సి. మూలధన కల్పన
డి. సాంకేతికాభివృద్ధి
1) ఎ, సి
2) బి, డి
3) సి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- సమాధానం: 4
26. జీవవైవిధ్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు?
1) రోసిన్
2) టొడారో
3) కుజ్నట్స్
4) రాబర్ట ఐరిన్
- View Answer
- సమాధానం: 1
27. కింది వాటిలో అపరిమితంగా పునరుద్ధరించే వనరు ఏది?
1) బొగ్గు నిల్వలు
2) శిలాజ ఇంధనాలు
3) సౌరశక్తి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
28.జాతీయ పర్యావరణ విధానం 2006 లక్ష్యం?
1) పర్యావరణ వనరుల వాడకంలో సమర్థత
2) కీలకమైన పర్యావరణ వనరుల సంరక్షణ
3) భావితరాల కోసం పర్యావరణ వనరులను సక్రమంగా విచక్షణంతో వినియోగించుకోవడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
29. మత్స్య సంపద చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
1) 1897
2)1991
3) 1997
4) 2006
- View Answer
- సమాధానం: 1
30.క్యోటో ప్రొటోకాల్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
1) 1998
2) 2002
3) 2004
4) 2005
- View Answer
- సమాధానం: 4
31. ఎకోసిటీ ప్రపంచ సదస్సు అక్టోబర్ 2019లో ఎక్కడ నిర్వహిస్తారు?
1) Vancouver, కెనడా
2) అమెజాన్, బ్రెజిల్
3) న్యూఢిల్లీ, ఇండియా
4) వాషింగ్టన్, అమెరికా
- View Answer
- సమాధానం: 1
32. సుస్థిరాభివృద్ధిపై 2012లో ఐక్యరాజ్య సమితి సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) కోల్‌కతా
2) రియోడిజెనిరో
3) జకర్తా
4) హాంకాంగ్
- View Answer
- సమాధానం: 2
33. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క కన్వెన్షన్ పార్టీల సమావేశం 2015 డిసెంబర్ 12న ఎక్కడ జరిగింది?
1) పారిస్
2) టోక్యో
3) సింగపూర్
4) రియోడిజెనిరో
- View Answer
- సమాధానం: 1
34.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 5
2) మే 5
3) జూన్ 5
4) జూలై 5
- View Answer
- సమాధానం: 3
35. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్‌ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
1) 2010
2) 2012
3) 2014
4) 2016
- View Answer
- సమాధానం: 1
36. ‘వేస్ట్ మేనేజ్మెంట్ అవుట్‌లుక్’ను ప్రచురించినది?
1) UNDP
2) UNEP
3) ప్రపంచ ఆరోగ్య సంస్థ
4) వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
37. కర్మాగారాల చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1882
2) 1905
3) 1938
4) 1948
- View Answer
- సమాధానం: 4