స్టార్టప్ ఇండియా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1. ప్రభుత్వ రంగంలో మొదటగా విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కర్ణాటకలో కింది ఏ ప్రాంతంలో ప్రారంభమైంది?
1) హోసూరు
2) బళ్లారి
3) భద్రావతి
4) రాయచూరు
- View Answer
- సమాధానం: 3
2.భారత్‌లో 1818 సంవత్సరంలో మొదటి వస్త్ర మిల్లును కింది ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
1) ముంబాయి
2) కోల్కత్తా
3) చెన్నై
4) ఔరంగాపూర్
- View Answer
- సమాధానం: 2
3. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పునర్నిర్మాణ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 2004 డిసెంబర్
2) 2005 డిసెంబర్
3) 2006 డిసెంబర్
4) 2007 డిసెంబర్
- View Answer
- సమాధానం: 1
4. జి.వి. రామకృష్ణ కింది ఏ కమిటీ అధ్యక్షుడు?
1) బ్యాంకింగ్ రంగ సంస్కరణల కమిటీ
2) ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్
3) బీమా సంస్కరణల కమిటీ
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 2
5. స్వదేశీ, బహుళ జాతి సంస్థలు తమ ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేయడానికి 2014 సెప్టెంబర్‌లో ప్రారంభించిన పథకం?
1) స్టార్టప్ ఇండియా
2) స్టాండప్ ఇండియా
3) ముద్ర
4) మేక్ ఇన్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
6. స్టార్టప్ ఇండియా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 2015 జనవరి
2) 2016 జనవరి
3) 2017 జనవరి
4) 2018 జనవరి
- View Answer
- సమాధానం: 2
7. 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య?
1) 15
2) 16
3) 17
4) 18
- View Answer
- సమాధానం: 3
8. 6వ ఎకనమిక్ సెన్సెస్ ప్రకారం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంటర్ప్రైజెస్ కలిగిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) çకర్ణాటక
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
9. 1814 సంవత్సరంలో మొదటిగా కింది ఏ ప్రాంతంలో బొగ్గును వెలికి తీశారు?
1) రాణిగంజ్
2) సింగరేణి
3) హోసూరు
4) డిగ్బోయ్
- View Answer
- సమాధానం: 1
10. జాతీయ పెట్టుబడి నిధిని కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2005 జనవరి
2) 2007 జనవరి
3) 2009 జనవరి
4) 2011 జనవరి
- View Answer
- సమాధానం: 1
11. హజారీ కమిటీని 1965లో ఏ నిమిత్తం ఏర్పాటుచేయడం జరిగింది?
1) పారిశ్రామిక లైసెన్స్‌ల ఎంక్వయిరీ
2) పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం అమలు తీరును పర్యవేక్షించడం
3) బ్యాంకింగ్ రంగ జాతీయకరణ
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 2
12. దేశంలో మొదటి చమురు ఉత్పత్తి కేంద్రాన్ని అస్సాంలో కింది ఏ ప్రదేశంలో ప్రారంభించారు?
1) డిగ్బోయ్
2) గౌహతి
3) దిస్పూర్
4) కరింగంజ్
- View Answer
- సమాధానం: 1
13. ఏకస్వామ్యాల పరిశీలనా సంఘం (1964) అధ్యక్షుడు?
1) దత్
2) రాఘవన్
3) దాస్ గుప్తా
4) హజారే
- View Answer
- సమాధానం: 3
14. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటైన సంవత్సరం?
1) 1977
2) 1990
3) 1991
4) 2006
- View Answer
- సమాధానం: 2
15. సప్తరుణి కమిటీ కింది ఏ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించింది?
1) ఉక్కు
2) పంచదార
3) తోలు
4) టీ పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4
16. హర్యానాలోని పానిపట్ కింది ఏ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది?
1) టెక్స్టైల్స్
2) విద్యుచ్ఛక్తి
3) ఆటో పరికరాల తయారీ
4) బొగ్గు
- View Answer
- సమాధానం: 1
17.పశ్చిమ బెంగాల్లో టీ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం?
1) హల్దియా
2) దుర్గాపూర్
3) డార్జిలింగ్
4) ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
18. కింది వాటిలో మహారత్న హోదా పొందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ?
ఎ) ONGC
బి) కోల్ ఇండియా లిమిటెడ్
సి) NTPC
డి) AIL
1) ఎ,డి
2) బి,డి
3) ఎ,సి
4) ఎ,బి,సి,డి
- View Answer
- సమాధానం: 4
19. భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరం తన నూతన కేంద్రాన్ని కింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) న్యూఢిల్లీ
4) కోల్కత్తా
- View Answer
- సమాధానం: 1
20. భారతదేశంలో మొదటి సిమెంటు మిల్లును 1904లో కింది ఏ ప్రాంతంలో ప్రారంభించారు?
1) బెంగళూరు
2) çపుణే
3) నల్గొండ
4) మద్రాస్
- View Answer
- సమాధానం: 4
21. ఖాయిలా కంపెనీల చట్టం, 1985ను కింది ఏ కమిషన్ సిఫార్సు మేరకు తీసుకువచ్చారు?
1) హజారే కమిషన్
2) తివారీ కమిషన్
3) మహలోనబిస్ కమిషన్
4) దత్ కమిషన్
- View Answer
- సమాధానం: 2
22. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కింది ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 1997
2) 1999
3) 2000
4) 2002
- View Answer
- సమాధానం: 4
23. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని రూపొందించే సంస్థ?
1) కేంద్ర గణాంక సంస్థ
2) NSSO
3) నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
24. నూనె మిల్లుల అభివృద్ధికి సంబంధించి 1997లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షుడు?
1) మీరాసేత్
2) అబిద్ హుస్సేన్
3) రంగరాజన్
4) ఎం.హనుమంతరావు
- View Answer
- సమాధానం: 1
25. మొదటిసారిగా సహజ వాయువును హిమాచల్‌ప్రదేశ్‌లో కింది ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
1) సిమ్లా
2) మనాలి
3) జ్వాలాముఖి
4) చంబ
- View Answer
- సమాధానం: 3
26. ఇటీవల ప్రవేశపెట్టిన ‘నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ 2018’ లక్ష్యం?
1) 2025 నాటికి ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ విలువ 400 బిలియన్ డాలర్లకు చేరుకోవడం
2) మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని 2019లో 500 మిలియన్ యూనిట్ల నుంచి 2025 నాటికి 1 బిలియన్కు పెంచడం
3) ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించి అన్ని ఉప రంగాలలో పోటీతత్వం పెంపొందించడం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. ప్యూచర్ ఆఫ్ వర్క్ ఇన్ ఇండియా నివేదికను ఇటీవల విడుదలచేసిన సంస్థ?
1) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
2) ఐ.ఎం.ఎఫ్.
3) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) ఐ.డి.బి.ఐ.
- View Answer
- సమాధానం: 1
28. నాస్కాం ఇటీవల Internet of things కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కింది ఏ ప్రాంతంలో ప్రారంభించింది?
1) హైదరాబాద్
2) గుర్గావ్
3) అమరావతి
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
29. ఎనిమిది కీలక రంగ పరిశ్రమల వృద్ధిని ఆగస్టు 2018లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎంతగా అంచనావేసింది?
1) 3.7 శాతం
2) 4.1 శాతం
3) 4.2 శాతం
4) 4.7 శాతం
- View Answer
- సమాధానం: 3
30. Reinvigorating trade and Inclusive Growth నివేదికను సంయుక్తంగా ప్రచురించినవారు?
1) ఐ.ఎం.ఎఫ్., డబ్లు.టి.వో., ప్రపంచ బ్యాంక్
2) ఆసియా అభివృద్ధి బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా
3) ఐ.ఎఫ్.సి.ఐ., ప్రపంచ బ్యాంక్
4) ఐ.డి.బి.ఐ., ఐ.ఎం.ఎఫ్.
- View Answer
- సమాధానం: 1