ధరలు- ద్రవ్యోల్బణం (2018- 19 ఆర్థిక సర్వే)
- టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో క్షీణించింది. 2018-19లో టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 0.6 శాతంగా నమోదైంది. టోకు ధరల సూచీ ఆహార ద్రవ్యోల్బణం 2018-19లో తగ్గడానికి పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పంచదార ధరల తగ్గుదల ప్రధాన కారణంగా నిలిచింది.
- భారిత (weight), అంశాలను (Items) వినియోగ ధరల సూచీ - ఉమ్మడి (CPI-C) ఆధారంగా పరిశీలించినప్పుడు ఇతరాలు అధిక భారితం (weight) కలిగి ఉండగా, తర్వాత స్థానాల్లో హౌసింగ్, రవాణా, సమాచారం, cereals and products, ఆరోగ్యం, వస్త్రాలు, విద్య నిలిచాయి. వినియోగ ధరల సూచీ-ఉమ్మడి ఆధారిత కోర్ఇన్‌ఫ్లేషన్ నుంచి ఆహారం, ఇంధన గ్రూపులను మినహాయించగా వినియోగ ధరల సూచీ విలువ తెలుస్తుంది. CPI-C ఆధారిత కోర్‌ఇన్‌ఫ్లేషన్ 2017-18లో 4.6 శాతం కాగా, 2018-19లో 5.8 శాతానికి పెరిగి ఏప్రిల్ 2019 నాటికి 4.5 శాతానికి తగ్గింది.
- అఖిల భారత స్థాయిలో (CPI-C) ద్రవ్యోల్బణానికి ప్రధానంగా miscellaneous గ్రూపు తర్వాత హౌసింగ్, ఇంధనం, లైట్ గ్రూపు లాంటి అంశాలు నిలిచాయి. CPI-C లో వస్తు ద్రవ్యోల్బణ భారితం 76.6 శాతం కాగా, సేవల ద్రవ్యోల్బణ భారితం 23.4 శాతంగా ఉంది.
- వస్తు ద్రవ్యోల్బణంతో పోల్చినపుడు సేవల ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, ఈ రెండింటి మధ్య తేడా పెరుగుతుండటాన్ని గమనించవచ్చు. వినియోగ ధరల సూచీ-ఉమ్మడిలో 40 అంశాలకు సంబంధించిన సేవల భారితం 23.37 శాతం. సేవలో హౌసింగ్ భారితం(10.07 శాతం) అధికం కాగా, తర్వాత స్థానాల్లో రవాణా, సమాచారం (4.59 శాతం), విద్య(3.51 శాతం), ఆరోగ్యం(1.82 శాతం) నిలిచాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సేవల ద్రవ్యోల్బణంలో ప్రధాన అంశాలైన విద్య, ఆరోగ్య, రవాణా, సమాచారం ప్రాధాన్యత పొందాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంలో ద్రవ్యోల్బణం ప్రధానమైంది.
- గ్రామీణ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల కారణమైంది. 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు ఆహార ద్రవ్యోల్బణం రుణాత్మకంగా నమోదైంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే ఆహార ప్రాధాన్యత తగ్గుతుంది. మరోవైపు గ్రామీణ ద్రవ్యోల్బణంలో సేవల పాత్ర పెరుగుదలను గమనించవచ్చు. గ్రామీణ ద్రవ్యోల్బణంలో సేవల వాటా 70 శాతంగా 2018-19లో నమోదైంది. పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణానికి సేవలతోపాటు హౌసింగ్ ప్రధానాంశాలుగా నిలిచాయి.
- అనేక రాష్ట్రాల్లో 2018-19లో ఇ్కఐ ద్రవ్యోల్బణంలో తగ్గుదలను గమనించవచ్చు. 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో CPI ద్రవ్యోల్బణం సగటు 4 శాతంలోపు నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో CPI ద్రవ్యోల్బణం(-)1.9 శాతం నుంచి 8.9 శాతం మధ్య నమోదైంది. 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ద్రవ్యోల్బణం (CPI) దేశ సగటు కంటే తక్కువ. 2018-19లో డామన్, డయులో ద్రవ్యోల్బణం అతి తక్కువగా నమోదుకాగా, తర్వాత స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి.
- 2018-19లో 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం (CPI) నాలుగు శాతం కంటే తక్కువగా నమోదైంది. మరోవైపు 9 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4 శాతంలోపు నమోదైంది.
- వస్తు ధరలను ప్రచురించిన ప్రపంచ బ్యాంకు అభిప్రాయం ప్రకారం, 2018-19లో శక్తికి సంబంధించిన వస్తు ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. ప్రపంచ బ్యాంకు ఆహార ధరలు,food and agriculture organisation ఆహార ధరలు 2018-19లో ప్రతి ద్రవ్యోల్బణాన్ని చవిచూశాయి. టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణంలోనూ 2018-19లో తగ్గుదల ఏర్పడింది.
- ద్రవ్యోల్బణ నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన విధానపరమైన చర్య అయినందువల్ల ధరల స్థితిని తరచుగా సమీక్షిస్తుంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆహార ధాన్యాల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం సలహానిచ్చింది. నిత్యావసర వస్తువుల చట్టం 1955, prevention of black-marketing and maintenance of supplies of essential commodities Act 1980 ను సమర్థంగా అమలు పరచడానికి ఈ చర్య దోహదపడుతుంది.
- ధరలు, ముఖ్య వస్తువుల లభ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరచుగా సమీక్ష సమావేశాలను నిర్వహించింది.
- పప్పు ధాన్యాలు, ఇతర పంటల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆయా పంటలకు అధిక మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అగ్రి-హార్టికల్చర్ ఉత్పత్తులను సేకరించడానికి ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెరిగిన ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి నిల్వలను తక్కువ ధరల వద్ద మార్కెట్‌కు ప్రభుత్వం అందించింది. నిల్వ చేసిన పప్పు ధాన్యాలను; ధరల యాజమాన్యానికి సంబంధించి వ్యూహాత్మక మార్కెట్ జోక్యంలో భాగంగా వినియోగించింది.
1. వినియోగ ధరల సూచీ - (ఉమ్మడి)లో వస్తువుల భారితం (weight) ఎంత?
1) 75.63 శాతం
2) 76.63 శాతం
3) 77.63 శాతం
4) 78.63 శాతం
- View Answer
- సమాధానం: 2
2. వినియోగ ధరల సూచీ (ఉమ్మడి)లో సేవల ద్రవ్యోల్బణ భారితం ఎంత?
1) 23.4 శాతం
2) 35.4 శాతం
3) 36.5 శాతం
4) 37.5 శాతం
- View Answer
- సమాధానం: 1
3. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండటానికి కింది వాటిలో ఏ ద్రవ్యోల్బణం అవసరం?
1) పరిగెత్తే ద్రవ్యోల్బణం
2) హైపర్ ఇన్ఫ్లేషన్
3) పాకే ద్రవ్యోల్బణం
4) డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
- View Answer
- సమాధానం: 3
4. ద్రవ్యోల్బణ కాలంలో కింది వారిలో ఎవరు లాభం పొందుతారు?
1) రుణదాతలు
2) వినియోగదారులు
3) స్థిర ఆదాయం పొందే వారు
4) రుణగ్రహీతలు
- View Answer
- సమాధానం: 4
5. ఆహారం, శక్తి లాంటి అంశాలను మినహాయించి మిగిలిన వస్తువుల ధరల్లో మార్పులను గణించగా వచ్చిన దాన్ని కింది ఏ ద్రవ్యోల్బణంగా పరిగణిస్తాం?
1) కోర్ ఇన్ఫ్లేషన్
2) హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్
3) హైపర్ ఇన్ఫ్లేషన్
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: 1
6. ప్రపంచ బ్యాంకు అభిప్రాయం ప్రకారం 2018-19లో కింది ఏ వస్తువులకు సంబంధించిన ధరల్లో పెరుగుదల అధికం?
1) తృణ ధన్యాలు
2) వస్త్రాలు
3) శక్తి
4) ఆరోగ్యం
- View Answer
- సమాధానం: 3
7. కింది వాటిలో ఏ ఉత్పత్తులను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ధరల స్థిరీ కరణ నిధిని ఏర్పాలు చేసింది?
1) ఉల్లిపాయలు
2) అగ్రి-హార్టికల్చర్
3) గోధుమలు
4) పత్తి
- View Answer
- సమాధానం: 2
8. టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 2018-19లో ఎంత నమోదైంది?
1) 0.6 శాతం
2) 1.5 శాతం
3) 2.5 శాతం
4) 3.2 శాతం
- View Answer
- సమాధానం: 1
9.CPI----Cలో అధిక భారితం (weight) కలిగింది ఏది?
1) రవాణా, సమాచారం
2) వస్త్రాలు
3) విద్య
4) miscellaneous group
- View Answer
- సమాధానం: 4
10. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడాన్ని ద్రవ్యోల్బణంగా వర్ణించింది ఎవరు?
1) హాట్రే
2) క్రౌధర్
3) కీన్స
4) శామ్యుల్సన్
- View Answer
- సమాధానం: 1
11. కింది వాటిలో ఏ సంస్థ మార్గదర్శకాల ప్రకారం వినియోగ ధరల సూచీని అన్ని దేశాలు రూపొందిస్తాయి?
1) ఐ.ఎం.ఎఫ్.
2) అంతర్జాతీయ శ్రామిక సంస్థ
3) ఆసియా అభివృద్ధి బ్యాంకు
4) సిటి బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
12. సమష్టి డిమాండ్‌లో పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని ఎవరు పేర్కొన్నారు?
1) కీన్స
2) శామ్యుల్ సన్
3) ఫిషర్
4) లాఫర్
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణానికి కారణం ఏమిటి?
ఎ. ప్రభుత్వ వ్యయం పెరుగుదల
బి. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో తగ్గుదల
సి. పెట్టుబడి రేటు పెరుగుదల
డి. అధిక దిగుమతుల వృద్ధి
1) ఎ మాత్రమే
2) ఎ, బి
3) ఎ, బి, సి, డి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
14. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కింది వాటిలో సరైన చర్య ఏది?
1) బ్యాంకు రేటు తగ్గించడం
2) ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం
3) రెపోరేటు తగ్గించడం
4) ప్రభుత్వ వ్యయం పెంచడం
- View Answer
- సమాధానం: 2
15. CPI- C లో సేవలకు సంబంధించి అధిక భారితం కలిగింది ఏది?
1) హౌసింగ్
2) విద్య
3) ఆరోగ్యం
4) రవాణా, సమాచారం
- View Answer
- సమాధానం: 1
16. NHB RESIDEX అంటే ఏమిటి?
1) ఆహార ధరల సూచీ
2) ఆరోగ్య సూచీ
3) మొదటి అధికారిక హౌసింగ్ ధరల సూచీ
4) అసమానతల సూచీ
- View Answer
- సమాధానం: 3
17. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణం ఏమిటి?
1) నిర్మాణాత్మక లోపాలు
2) తలసరి ఆదాయ వృద్ధిలో పెరుగుదల
3) లోటు బడ్జెట్ విధాన ం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18.టోకు ధరల సూచీలో అధిక భారితం కలిగింది ఏది?
1) తయారీ ఉత్పత్తులు
2) ఇంధనం
3) ప్రాథమిక ఉత్పత్తులు
4) విద్యుత్
- View Answer
- సమాధానం: 1
19.కామర్స్ మంత్రిత్వ శాఖ టోకు ధరల సూచీ గణనకు ఆధార సంవత్సరాన్ని 2011-12 నుంచి కింది వాటిలో ఏ సంవత్సరానికి మార్చాలని భావిస్తోంది?
1) 2014-15
2) 2016-17
3) 2017-18
4) 2018-19
- View Answer
- సమాధానం: 3
20. గృహ ధరల సూచీ గణనకు ఆధార సంవత్సరం ఏది?
1) 2010-11
2) 2013-14
3) 2014-15
4) 2015-16
- View Answer
- సమాధానం: 1
21. నిరుద్యోగిత రేటుకు, వేతనాల్లో పెరుగుదలకు విలోమ సంబంధం ఉంటుందని ఎవరు పేర్కొన్నారు?
1) ఎ.డబ్ల్యు. ఫిలిప్స్
2) ఫిషర్
3) పిగూ
4) మార్షల్
- View Answer
- సమాధానం: 1
1) కీన్స్
3) రాబర్ట్ సన్
4) ఫిషర్
- View Answer
- సమాధానం: 4
23. వస్తువులపై ద్రవ్యోల్బణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
1) వస్తు ధరల తగ్గుదల
2) వస్తు ధరల స్థిరత్వం
3) వస్తు ధరల పెరుగుదల
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
24. స్టాగ్ ఫ్లేషన్ అంటే ఏమిటి?
1)ఆర్థిక వ్యవస్థ తిరోగమనాన్ని ఎదుర్కొంటున్న స్థితి
2) ద్రవ్యోల్బణం, తిరోగమనం కలసి ఉన్న స్థితి
3) అల్ప నిరుద్యోగం
4) తక్కువ ఆర్థిక అసమానతలు
- View Answer
- సమాధానం: 2
25. How to pay for money గ్రంథకర్త ఎవరు?
1) జె.యం. కీన్స
2) పాల్ క్రూగ్ మన్
3) మార్షల్
4) శ్యామ్ పిట్రోడా
- View Answer
- సమాధానం: 1
26. జూలై 2007న నేషనల్ హౌసింగ్ బ్యాంకు ప్రారంభించిన సూచీ ఏది?
1) S & P గ్లోబల్ 100 ఇండెక్స్
2) S & P గ్లోబల్ 1200 ఇండెక్స్
3) NHB RESIDEX
4) NIFTY
- View Answer
- సమాధానం: 3
27. ద్రవ్యోల్బణ అంతరం ఎప్పుడు ఏర్పడుతుంది?
1) వాస్తవిక జీడీపీ = సామర్థిత జీడీపీ
2) వాస్తవిక జీడీపీ సామర్థిత జీడీపీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు
3) ప్రతి ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నపుడు
4) నిరుద్యోగిత రేటు పేద రిక స్థాయి కంటే అధికంగా ఉన్నప్పుడు
- View Answer
- సమాధానం: 2
28. CPI---Cలో ఆరోగ్యానికి ఇచ్చిన భారితం ఎంత?
1) 5.89 శాతం
2) 6.5 శాతం
3) 7.1 శాతం
4) 8.2 శాతం
- View Answer
- సమాధానం: 1
29. గృహ ధరల సూచీని 2007 నుంచి గణిస్తున్న సంస్థ ఏది?
1) ఆంధ్రా బ్యాంక్
2) నేషనల్ హౌసింగ్ బ్యాంక్
3) ఆర్.బి.ఐ.
4) ఎస్.బి.ఐ.
- View Answer
- సమాధానం: 3
ఎ. డామన్, డయు
సి. ఆంధ్రప్రదేశ్
1) ఎ, డి
2) బి, డి
3) సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4