Skip to main content

TSPSC Group 2 Jobs Competition 2023 : 783 గ్రూప్‌–2 ఉద్యోగాలు.. ఒక్కోక్క పోస్టుకు ఎంత మంది పోటీప‌డుతున్నారంటే..? ఎక్కువ పోస్టులు వీరికే ఈ సారి..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రస్తుతం తెలంగాణ‌లో పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే ఎక్కువ మంది అభ్య‌ర్థుల దృష్టి గ్రూప్‌-2 పైనే ప‌డింది. ఎందుకంటే.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించనున్నారు.
TSPSC Group 2 Competition 2023 Details in Telugu
TSPSC Group 2 Competition 2023

అలాగే ఈ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు పోటీ కూడా తీవ్రంగానే ఉంది. మొత్తం 783 గ్రూప్‌–2 పోస్టుల‌కు  గాను.. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

☛ TSPSC Group 2 Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. 350 పోస్టులు మహిళలకే.. కానీ
 
ఒక్కో పోస్టుకు ఎంత మంది పోటీ అంటే..?

tspsc group 2 jobs 2023 telugu news

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 783 పోస్టులకు.. వచ్చిన దరఖాస్తులను పోల్చితే.. ఒక్కో పోస్టుకు 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా.. వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్‌ కేటగిరీలో లేదు.

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే.. ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు. ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్‌ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్‌ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్‌ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. మొత్తంగా ఈ నోటిఫికేన్‌లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. తద్వారా 350 పోస్టులు వారికే దక్కనున్నాయి.
☛ TSPSC Group 2 Exam Pattern 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష విధానం ఇదే.. సబ్జెక్ట్‌ల వారిగా ప్ర‌శ్న‌లు ఇవే..

రాత ప‌రీక్ష ఆధారంగానే..

tspsc group 4 exam tips in telugu

గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్‌ ఛాయిల్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్‌ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్‌-1లో జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, పేపర్‌-2లో చరిత్ర, పాలిటీ, సొసైటీ, పేపర్‌-3లో ఎకానమీ, డెవలప్‌మెంట్‌, పేపర్‌-4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రశ్నలుంటాయి. ఈ గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన hall ticket ల‌ను ప‌రీక్ష‌కు వారం రోజులు ముందు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ అందుబాటులో ఉండ‌నున్న‌ది. ఈ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు ఇంటర్వూలు లేవు. రాత‌ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు.

☛➤ Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

Published date : 05 Jul 2023 04:50PM

Photo Stories