Skip to main content

Free Coaching for Group Exams: గ్రూప్స్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల అర్బన్‌: బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌–1,2,3,4 ఫౌండేషన్‌ కోర్సుల ఉచిత శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగుతుల ఆభివృద్ధి శాఖ అధికారి శ్వేతా ప్రియదర్శిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free Coaching for Group Exams in telangana

జిల్లాలోని డిగ్రీ పూర్తయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతీ, యువకులు ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌, ఆధార్‌ కార్డు కులం, ఆదాయం సర్టిఫికేట్లతో ఈనెల 20వ తేదీలోగా http://tsbcstudycircle.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించకూడదని, రిజర్వేషన్లు, డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నయని పేర్కోన్నారు. మరిన్ని వివరాలకు 08546–293022, 99085 60268 నంబర్లకు లేదా జిల్లా కేంద్రంలో మొదటి రైల్వేగేటు దగ్గరలోని బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

చదవండి: TSPSC Group 2 Guidance: రివిజన్‌తోనే సక్సెస్‌ అంటున్న నిపుణులు!

ఖేలో ఇండియాకు విద్యార్థిని ఎంపిక
గద్వాల అర్బన్‌: ఈనెల 8న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన ఖేలో ఇండి యా సెలెక్షన్స్‌ కబడ్డీ పోటీల్లో జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల ప దో తరగతి విద్యార్థిని రిజ్వాన ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఈనెల 19నుంచి 30వ తేదీ వర కు తమిళనాడులోని కొయంబత్తూరులో జరగబోయే ఖేలో ఇండియా యూత్‌ ఫెస్టివల్‌ పోటీ లకు ఎంపికై ంది. ఆమె తెలంగాణ జట్టు తరుపున ఆడనున్నారు. ఈ నేపథ్యంలో కబడ్డీ అసో షియేషన్‌ ప్రధాన కార్యదర్శి అబ్రహం, కోచ్‌ తిరుపతయ్య, అర్గనైజింగ్‌ సెక్రటరీ, పాఠశాల ప్రిన్సిపాల్‌ నవిత జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో రిజ్వానకు పూలమాల, శాలువాతో సన్మానించి అభినందించారు. కా ర్యక్రమంలో పీఈటీ నేహ పర్వీన్‌, కబడ్డీ అ సోషియేషన్‌ సభ్యులు ఉన్నారు.

డీఈఈసెట్‌రెండో దశ వెబ్‌ ఆప్షన్లు
మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: డీఈఈసెట్‌–2023 పరీక్ష రాసి వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు వెబ్‌ ఆప్షన్‌లు పెట్టుకునేందుకు ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్‌ మెరాజుల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం కోసం 99499 93714 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
 

Published date : 19 Jan 2024 12:49PM

Photo Stories