APPSC Group 1 & 2 Awareness Program : సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో.. గ్రూప్–1, 2 ఉద్యోగ పరీక్షలపై గుంటూరులో ఉచిత అవగాహన సదస్సు
➤ డిసెంబర్ 2వ తేదీన గుంటూరులో సదస్సు
➤ గెస్ట్ స్పీకర్‌గా సివిల్స్ విజేత బాలలత
● లక్ష్యం: గ్రామీణ, పట్టణ విద్యార్థులకు గ్రూప్–1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్–1,2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో..గ్రామీణ, పట్టణ విద్యార్థులను గ్రూప్–1,2 స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో.. సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత అవగాహన సదస్సులను నిర్వహించనుంది.గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సాక్షిఎడ్యుకేషన్.కామ్ తోడుగా ఉంటున్న విషయం మీ అందరికి తెల్సిందే.
గెస్ట్ స్పీకర్‌గా బాలలత :
ఎంతో మందిని పోటీ పరీక్షల్లో విజేతలుగా తీర్చిదిద్దుతున్న సివిల్స్ టాపర్ బాలలత గారు గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సుకు గెస్ట్ స్పీకర్‌గా హాజరుకానున్నారు. ఆమె గ్రూప్1,2 పరీక్షలపై అవగాహన కల్పించడం తోపాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 8977625795 ఫోన్ నెంబర్‌కు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపగలరు.
ముఖ్య సమాచారం:
☛ అవగాహన సదస్సు తేదీ : డిసెంబర్ 2, 2023(శనివారం)
☛ వేదిక : ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ (ఏసీ కాలేజీ), గవర్నమెంట్ ఆసుపత్రి ప్రక్కన, సాంబశివ పేట్, మెయిన్ రోడ్, గుంటూరు.
☛ సమయం : ఉదయం 09:30 నుంచి 12:30 వరకు.
Tags
- APPSC Group 1
- appsc group 2 exam pattern
- APPSC Group-2
- appsc group 1 awareness program
- appsc group 2 awareness program
- Bala latha
- APPSCNotification
- Group1Recruitment
- Group2Recruitment
- AndhraPradeshJobs
- TrainingProgramme
- RuralEmployment
- UrbanEmployment
- AwarenessSeminars
- CompetitiveExams
- GovernmentJobs
- FreeSeminars
- JobOpportunities
- Sakshi Education Latest News