Skip to main content

Group-2 Books: గ్రూప్స్‌–2కు నేను చదివిన పుస్తకాలు ఇవే..: బి.ప్రదీప్‌ కుమార్, గ్రూప్ 2 విజేత

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ పరీక్షలకు.. ఎంతో క్రేజ్‌. వీటికి లక్షల మంది సన్నద్ధమవుతుంటారు. నోటిఫికేషన్‌ సంకేతం వచ్చిదంటే చాలు.. ప్రిపరేషన్‌లో నిమగ్నమైపోతారు.
Group 2 Books
Group 2 Success Tips

విజయ సాధనకు నిర్విరామంగా  కృషి చేస్తుంటారు! లక్షల మంది పరీక్షలు రాసినా.. విజయం దక్కేది కొందరికే! అడుగులు తడబడకుండా.. గమ్యం వైపు ప్రయాణం సాగించే వారే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంటారు. గ్రూప్స్‌లో విజేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–2 విజేత బి.ప్రదీప్‌ కుమార్, మండల పంచాయతీ ఆఫీసర్‌ గారి సూచనలు.. సలహాలు మీకోసం..

పట్టు సాధించాల్సిన అంశాలపై గట్టిగా..
గ్రూప్స్‌ అభ్యర్థులు ప్రామాణిక మెటీరియల్‌ను చదువుతూనే.. ఆన్‌లైన్‌లో ఉన్న వనరులను వినియోగించుకోవాలి. తమ ప్రిపరేషన్‌ స్థాయిని తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఫలితంగా తమ బలాలు, బలహీనతలు, సంబంధిత సబ్జెక్ట్‌లో పొందిన పరిజ్ఞానం, ఇంకా పట్టు సాధించాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. దీనిద్వారా సదరు అంశాలకు ప్రిపరేషన్‌ సాగించేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలి. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే తీరులో..
గ్రూప్‌–2 ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనికోసం బిట్‌ బ్యాంక్స్‌ లేదా ఇన్‌స్టంట్‌ మెటీరియల్‌కు పరిమితం కాకూడదు. ఎందుకంటే.. గ్రూప్స్‌ పరీక్షల్లో ప్రశ్నలు అడిగే తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ప్రశ్న కూడా పూర్తిగా విషయ పరిజ్ఞానం ఉంటేనే సమాధానం ఇవ్వగలిగేలా ఉంటున్నాయి. అసెంప్షన్‌ అండ్‌ రీజన్‌ తరహా ప్రశ్నలను దీనికి ఉదాహరణగా పేర్కొనొచ్చు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. ఒక విషయానికి సంబంధించి అన్ని కోణాల్లో పరిజ్ఞానం అవసరం. మ్యాథమెటిక్స్, సైన్స్‌ నేపథ్యం ఉన్న వారు గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ విషయంలో ప్రత్యేక దృష్టితో వ్యవహరించాలి. ముఖ్యంగా ఎకానమీ, హిస్టరీ, పాలిటీల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. 

TSPSC Groups Preparation Plan: ఎలాంటి ఒత్తిడి.. టెన్ష‌న్ లేకుండా.. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వండిలా..

ఈ పుస్తకాలను..
నాది.. బీటెక్‌ నేపథ్యం కావడంతో వీటికోసం ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ సాగించాను. ఇండియన్‌ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అంశాలపై అవగాహనకు మెక్‌గ్రాహిల్‌ పబ్లికేషన్స్‌ పుస్తకాలు చదివాను. ఇక.. రాష్ట్ర అంశాలకు సంబంధించి అకాడమీ పుస్తకాలను, తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావ దశల కోసం వి.ప్రకాశ్‌ పుస్తకాలు చదివాను. గ్రూప్‌–1,2 రెండింటికీ సిద్ధమవ్వాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రిపరేషన్‌ ప్రారంభించి.. సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా ప్రతి అంశానికి సంబంధించి.. నిరంతర పునశ్చరణ ఎంతో ముఖ్యమని గుర్తించాలి. ప్రిపరేషన్‌ చివరి దశలో, పరీక్షకు ముందు ప్రాక్టీస్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా పోటీని చూసి ఆందోళన చెందకుండా.. సాధించగలం అనే సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి. 

Inspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

Published date : 04 Apr 2022 05:50PM

Photo Stories