Indian Polity Quiz: సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో నిర్మించారు?
1. భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) భారత ప్రజలమైన మేము రాజ్యాంగ పరిషత్‌లో ఈ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందజేయాలని నిర్ణయించాం
2) భారత ప్రజలమైన మేము రాజ్యాంగ పరిషత్‌లో ఈ రాజ్యాంగాన్ని చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం
3) భారత ప్రజలమైన మేము రాజ్యాంగ పరిషత్ ప్రతినిధుల ద్వారా ఈ రాజ్యాంగాన్ని చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం
4) రాజ్యాంగ పరిషత్ సభ్యులమైన మేము భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాజ్యాంగాన్ని చట్టబద్ధం చేసి మాకు మేము సమర్పించుకుంటున్నాం
- View Answer
- Answer: 2
2. ‘పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రకటించింది?
1) కేశవానంద భారతీ కేసు
2) ఎస్.ఆర్. బొమ్మై కేసు
3) బెరుబెరి కేసు
4) గోలక్‌నాథ్ కేసు
- View Answer
- Answer: 1
3. భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం కావడానికి కారణం కానిది?
1) దేశ విస్తృత భూ భాగం
2) 1935లో భారత ప్రభుత్వ చట్టం ప్రభావం
3) కేంద్ర– రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు ఉండటం
4) రాజ్యాంగ పరిషత్‌లో న్యాయవాదుల ఆధిక్యత ఉండటం
- View Answer
- Answer: 3
4. కింది వాటిలో సరికాని జత ఏది?
1) రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక – అధికరణ 202
2) కేంద్ర వార్షిక ఆర్థిక నివేదిక – అధికరణ 112
3) కేంద్రం తీసుకునే రుణాలు – అధికరణ 293
4) ప్రభుత్వంపై దావా వేయడం – అధికరణ 300
- View Answer
- Answer: 3
5. ప్రస్తుతం ఆస్తిహక్కు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది?
1) 3వ భాగం
2) 10వ భాగం
3) 12వ భాగం
4) రాజ్యాంగంలో లేదు
- View Answer
- Answer: 3
6. కింది వాటిలో ప్రాథమిక హక్కుల లక్షణం కానిది ఏది?
1) ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి
2) ప్రాథమిక హక్కులు రాజ్యకార్యకలాపాలకు విరుద్ధం
3) ఇవి న్యాయ సమ్మతమైనవి
4) వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది
- View Answer
- Answer: 1
7. కింది వాటిలో నిబంధన–15 ద్వారా నిషేధించిన విచక్షణలు ఏవి?
ఎ) మతం
బి) జాతి
సి) కులం
డి) లింగం
ఇ) జన్మస్థానం
ఎఫ్) వారసత్వం
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి, డి, ఇ
3) ఎ, బి, సి, డి, ఎఫ్
4) ఎ, బి
- View Answer
- Answer: 2
8. 1973లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 371(డి)ను చేర్చి స్థానిక రిజర్వేషన్లు కల్పించారు?
1) 31
2) 32
3) 33
4) 34
- View Answer
- Answer: 2
9. క్రిమి లేయర్ భావనను తొలిసారిగా సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రతిపాదించింది?
1) ఇందిరా సహానీ కేసు
2) అశోక్ కుమార్ ఠాకూర్ కేసు
3) బాలాజీ రాఘవన్ కేసు
4) ప్రదీప్ టాండన్ కేసు
- View Answer
- Answer: 1
10. బ్యాక్లాగ్ వెకెన్సీలను ఎప్పుడైనా భర్తీ చేసుకోడానికి 50% రిజర్వేషన్ల నిబంధనను ఉల్లంఘించడానికి అవకాశం కల్పిస్తూ 2000 సంవత్సరంలో ఏ సవరణ చేశారు?
1) 80
2) 81
3) 82
4) 83
- View Answer
- Answer: 3
11. శిక్ష నుంచి రక్షణ, ద్వంద్వ శిక్షల నిషేధాన్ని ఏ ఆర్టికల్ ద్వారా కల్పించారు?
1) 14
2) 20
3) 25
4) 30
- View Answer
- Answer: 2
12. 1993లో సుప్రీంకోర్టు విద్యాహక్కును ఏ నిబంధనలో అంతర్భాగంగా పేర్కొంది?
1) 20
2) 21
3) 22
4) 23
- View Answer
- Answer: 2
13. రిట్ జారీ చేసే వి«ధానాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు?
1) ఇంగ్లండ్
2) అమెరికా
3) జపాన్
4) సౌత్ ఆఫ్రికా
- View Answer
- Answer: 1
14. అనర్హులు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిరోధించే రిట్ ఏది?
1) ప్రొహిబిషన్
2) మాండమస్
3) కోవారెంట్
4) ఇంజక్షన్
- View Answer
- Answer: 3
15. భారతదేశంలో ‘సైనిక శాసనం’ భావనను ఏ దేశం నుంచి గ్రహించారు?
1) అమెరికా
2) ఇంగ్లండ్
3) జపాన్
4) రష్యా
- View Answer
- Answer: 2
16. ఆస్తి హక్కు ఏ నిబంధనలో ఉండేది?
1) 31
2) 23
3) 21
4) 19 (1)
- View Answer
- Answer: 4
17. భారత పార్లమెంట్ చరిత్రలో కోత తీర్మానాలపై ఏయే సంవత్సరాల్లో ఓటింగ్ నిర్వహించారు?
ఎ) 1952
బి) 1977
సి) 2010
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) ఎ, సి
- View Answer
- Answer: 4
18. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించి తొలి వివాదం ఏది?
1) చంపకం దొరై రాజన్ కేసు
2) గోలక్‌నాథ్ కేసు
3) కేశవానంద భారతీ కేసు
4) మినర్వామిల్స్ కేసు
- View Answer
- Answer: 1
19. గోలక్‌నాథ్ కేసుకు స్పందనగా పార్లమెంట్ రూపోందించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 24
2) 25
3) 28
4) 31
- View Answer
- Answer: 1
20. రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో కింది వాటిలో అంతర్భాగం ఏది?
1) సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్రం
2) లౌకికవాదం
3) సమాఖ్య స్వభావం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
21. కింది వాటిలో రాష్ట్రపతి పదవికి అర్హత కానిది ఏది?
1) భారత వారసత్వం
2) కనీస వయసు 30 ఏళ్లు
3) పార్లమెంట్ సభ్యత్వం పొందడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి
4) ఏదీకాదు
- View Answer
- Answer: 2
22. కింది వారిలో రాష్ట్రపతి మహాభియోగ తీర్మానంలో పాల్గొనని వారెవరు?
1) లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్లు
2) రాజ్యసభలో 12 మంది ప్రముఖులు
3) వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు
4) పై వారందరూ
- View Answer
- Answer: 3
23. సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1950 జనవరి 26
2) 1950 జనవరి 27
3) 1950 జనవరి 28
4) 1950 జనవరి 29
- View Answer
- Answer: 1
24. కింది వాటిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హత కానిది ఏది?
1) భారత వారసత్వం
2) కనీసం 35 ఏళ్ల వయసు ఉండాలి
3) ఏదైనా హైకోర్టులో కనీసం 5 ఏళ్లు న్యాయమూర్తిగా అనుభవం
4) ఏదైనా హైకోర్టులో కనీసం 10 ఏళ్లు న్యాయవాదిగా అనుభవం
- View Answer
- Answer: 2
25. సుప్రీంకోర్టు/ హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానానికి ఎంతమంది మద్దతు ఉండాలి?
1) లోక్‌సభలో 100 మంది
2) రాజ్యసభలో 50 మంది
3) (1) లేదా (2)
4) (1), (2)
- View Answer
- Answer: 3
26. తాత్కాలిక న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) ప్రధాన న్యాయమూర్తి
3) ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి
4) రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- Answer: 4
27. సుప్రీంకోర్టు తన ప్రారంభ అధికార పరిధిలో అంతర్భాగంగా తొలి కేసును ఎప్పుడు స్వీకరించింది?
1) 1951
2) 1955
3) 1961
4) 1965
- View Answer
- Answer: 3
28. సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడే పద్ధతి ఏది?
1) నియామక విధానం
2) పదవీ విరమణ అనంతరం ప్రాక్టీస్‌పై పరిమితులు
3) కార్య నిర్వాహణ శాఖ నుంచి వేరు చేయడం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
29. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ధారిస్తారు?
1) గవర్నర్
2) రాష్ట్రపతి
3) పార్లమెంట్
4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
- View Answer
- Answer: 2
30. కింది వాటిలో ఏ హైకోర్టుకు ప్రాంతీయ బెంచ్‌లు ఉన్నాయి?
1) అలహాబాద్, బాంబే
2) కలకత్తా, గౌహతి
3) మధ్యప్రదేశ్, రాజస్థాన్
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
31. లక్షద్వీప్ ఏ హైకోర్టు పరిధిలో ఉంది?
1) బాంబే
2) కర్ణాటక
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- Answer: 3
32. మహిళా కమిషన్ సభ్యులను, చైర్‌పర్సన్‌ను ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) కేంద్ర ప్రభుత్వం
3) ప్రధానమంత్రి
4) మహిళా సంక్షేమ శాఖామంత్రి
- View Answer
- Answer: 2
33. 1978లో మైనార్టీ కమిషన్‌ను ఏ విధంగా ఏర్పాటు చేశారు?
1) కార్యనిర్వాహక తీర్మానం ద్వారా
2) పార్లమెంట్ తీర్మానం ద్వారా
3) రాజ్యాంగ సవరణ ద్వారా
4) రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా
- View Answer
- Answer: 1
34. జాతీయ ఎస్సీ కమిషన్ వార్షిక నివేదికను ఎవరికి ఇవ్వాలి?
1) రాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) పార్లమెంట్
4) క్యాబినెట్
- View Answer
- Answer: 1
35. ఒక క్యాబినెట్ మంత్రిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు..?
1) క్యాబినెట్ మంత్రులు రాజీనామా చేయాలి
2) సంబంధిత మంత్రి పదవీచ్యుతుడవు తారు
3) ప్రభుత్వం పడిపోతుంది
4) లోక్‌సభ రద్దవుతుంది
- View Answer
- Answer: 3
36. కేంద్ర ఉన్నత విద్యాలయాల్లో ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు సూచనలు చేయడానికి 2006 లో ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడెవరు?
1) ఎస్.ఆర్. పాండ్యన్
2) వీరప్ప మొయిలీ
3) భూటా సింగ్
4) రత్న కుమార్
- View Answer
- Answer: 2
37. ఎంపీ ల్యాడ్స్ ప్రారంభోత్సవంలో ఒక్కో ఎంపీకి కేటాయించిన మొత్తం ఎంత?
1) రూ. కోటి
2) రూ. 5 లక్షలు
3) రూ. 50 లక్షలు
4) రూ. 2 కోట్లు
- View Answer
- Answer: 2
38. కింది వాటిలో ఎస్సీ, ఓబీసీల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏది?
1) సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ
2) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) స్త్రీ– శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: 1
39. వివిధ జాతీయ కమిషన్లు, వాటి మొదటి చైర్మన్లకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా–1
i) జాతీయ ఎస్టీ కమిషన్
ii) జాతీయ మహిళా కమిషన్
iii) జాతీయ మైనార్టీ కమిషన్
iv) జాతీయ ఎస్సీ కమిషన్
v) జాతీయ ఓబీసీ కమిషన్
జాబితా–2
ఎ) కున్వర్ సింగ్
బి) జయంతి పట్నాయక్
సి) సర్ధార్ అలీఖాన్
డి) సూరజ్ భాన్
ఇ) ఆర్.ఎన్. ప్రసాద్
1) i-ఎ, ii-బి, iii-సి, iv-డి, v-ఇ
2) i-బి, ii-సి, iii-డి, iv-ఎ, v-ఇ
3) i-సి, ii-డి, iii-ఎ, iv-బి, v-ఇ
4) i-డి, ii-ఎ, iii-బి, iv-సి, v-ఇ
- View Answer
- Answer: 1
40. పార్లమెంట్ నిర్మాణాన్ని తెలియజేసే నిబంధన ఏది?
1) 52
2) 76
3) 79
4) 81
- View Answer
- Answer: 3
41. ప్రస్తుతం లోక్‌సభలో ఎంతమంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
1) 20
2) 13
3) 2
4) 4
- View Answer
- Answer: 2
42. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఒక పార్లమెంట్ సభ్యుణ్ని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది?
1) సభాధ్యక్షులు
2) రాష్ట్రపతి
3) ఎన్నికల సంఘం
4) సుప్రీంకోర్టు
- View Answer
- Answer: 1
43. కింది వాటిలో స్పీకర్‌కు ఉండి రాజ్యసభ చైర్మన్‌కు లేని అధికారం ఏది?
1) బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రకటించడం
2) ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించడం
3) ఆర్థిక కమిటీ అధ్యక్షులను నామినేట్ చేయడం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
44. లోక్‌సభ, రాజ్యసభల్లో కనీస కోరం ఎంత?
1) 55, 25
2) 50, 20
3) 45, 25
4) 40, 25
- View Answer
- Answer: 1
45. శూన్యకాలం ఎప్పటి నుంచి అమల్లో ఉంది?
1) 1952
2) 1962
3) 1972
4) 1974
- View Answer
- Answer: 2
46. సాధారణ బిల్లును రెండో సభ ఎంతకాలంలో ఆమోదించకపోతే రాష్ట్రపతి ఉభయసభల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయిస్తారు?
1) 30 రోజులు
2) 14 రోజులు
3) 6 నెలలు
4) 3 నెలలు
- View Answer
- Answer: 3
47. రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఏ నిబంధనలో ఉంది?
1) 110
2) 111
3) 112
4) రాజ్యాంగంలో లేదు
- View Answer
- Answer: 4
48. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో పాల్గొనే అధికారాన్ని అడ్వకేట్ జనరల్‌కు కల్పించే నిబంధన ఏది?
1) 76
2) 165
3) 177
4) 187
- View Answer
- Answer: 2
49. ఎన్నికల సంఘంలో ఎన్నికల అధికారుల సంఖ్యను ఎవరు నిర్ధారిస్తారు?
1) రాష్ట్రపతి
2) పార్లమెంట్
3) ప్రధాన ఎన్నికల కమిషనర్
4) రాజ్యాంగం
- View Answer
- Answer: 1
Tags
- Indian Polity GK Quiz
- Indian Polity Latest Quiz in telugu for competitive Exams
- Indian Polity new Quiz
- latest quiz
- Latest Quiz Questions
- competitive exams Latest Quiz
- Indian Polity Question Bank
- Polity Study Material for TS Police Exam
- Competitive Exams polity study Material
- Polity Quiz
- Polity Quiz for Competitive Exams
- Polity Bitbank in Telugu
- polity quiz in Telugu
- Division of states
- Trending Indian Polity Quiz
- indian polity quiz in telugu
- Indian Polity Bit Bank
- indian polity bit bank in telugu
- indian polity practice test in telugu
- indian polity bit bank for competitive exams
- Indian Polity Bit Bank For All Competitive Exams
- TSPSC
- TSPSC Study Material
- Competitive Exams Bit Banks
- police exam bit bank