Skip to main content

TSPSC Group-4 Results 2023 Date : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుద‌ల‌.. ఎప్పుడంటే..? అలాగే క‌టాప్ మార్కులు కూడా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ (TSPSC) నిర్వ‌హించిన గ్రూప్‌-4 రాత ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఆగ‌స్టు నెల‌లో విడుద‌ల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తున్నారు.
TSPSC Group 4 Results News 2023 Telugu News
TSPSC Group 4 Result News 2023

అలాగే ఈ గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ ని ఈ వారంలోనే వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కీ కి సంబంధించిన అభ్యంతరాలను వారం రోజుల పాటు స్వీక‌రించ‌నున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group 1&2&3 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ ప‌రీక్ష‌ను జూలై 1వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. గ్రూప్‌-4 పరీక్ష ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ దాదాపు పూర్తయింది.  కీ తో పాటు ఓఎంఆర్‌ పత్రాల స్కానింగ్‌ ఇమేజ్‌లను త్వరలోనే టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఒక వేళ ఈ గ్రూప్‌-4 ఫ‌లితాల విడుద‌ల కొన్ని అనివార్య కారణాల వ‌ల్ల ఆగ‌స్టులో సాధ్య‌ప‌డ‌కపోతే.. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

మొత్తం 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్‌-1కు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్-2కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

చ‌ద‌వండి: TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

ఈ నేప‌థ్యంలో.. గ్రూప్‌-4 ఉద్యోగాల సంఖ్య, ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు సంఖ్య‌, ప‌రీక్ష పేప‌ర్ ఆధారంగా, Reservation Policy, Previous Year Cutoff Marks, ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన‌ స‌ల‌హాలు-సూచ‌న‌లు, వివిధ స‌ర్వేల ఆధారంగా ఈ ఏడాది గ్రూప్‌-4 కటాఫ్‌ అంచనాను కింది ప‌ట్టిక‌లో ఇస్తున్నాము. ఈ కటాఫ్ మార్కులు కేవలం ఒక అంచనా మాత్ర‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అధికారికంగా ఇచ్చిన కటాఫ్ మార్కులు ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌లో సుమారు 99 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. జిల్లా, జోనల్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. జిల్లా, జోనల్‌ స్థాయిని బ‌ట్టి కూడా క‌టాప్ మార్కులు మారే అవ‌కాశం ఉంటుంది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 క‌టాప్ మార్కుల అంచ‌నా ఇలా..(ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల ఇచ్చిన మేర‌కు..)​​​​​​​

Category    Marks
Unreserved (General)  200-225
Other Backward Caste(OBC) 180-200
Scheduled Caste (SC)  150-180
Scheduled Tribe (ST)  140-170

TSPSC గ్రూప్‌-4 కటాఫ్ ఎంత‌..?​​​​​​​

Published date : 25 Jul 2023 05:02PM

Photo Stories