Skip to main content

TSPSC Group 4 Official Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-4 ఉద్యోగాల భ‌ర్తీకి జూలై 1వ తేదీ (శ‌నివారం) రాత‌ప‌రీక్ష నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. రెండు సెషన్లుగా ఉదయం, మధ్యాహ్నం జరిగిన ఈ పరీక్షలకు 80 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
TSPSC Group 4 Official Key 2023 Released Date
TSPSC Group 4 Official Key 2023 Details

రెండు పరీక్షలకు మొత్తంగా 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 9,12,380 మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)
గ్రూప్‌-4 రాత‌ప‌రీక్ష‌ 'కీ' ని ఎప్పుడు విడుద‌ల చేస్తారంటే..?

tspsc group 4 jobs 2023

టీఎస్‌పీఎస్సీ వెల్లడించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్‌–1 పరీక్షకు 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్‌–2 పరీక్షకు 7,61,198 మంది హాజరయ్యారు. తెలంగాణ‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 వేల ఉద్యోగాల భర్తీకి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఇక ఈ గ్రూప్‌-4 రాత‌పరీక్ష‌కు  సంబంధించిన ప్రాథ‌మిక కీ ని జూలై రెండో వారంలో విడుద‌ల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 'కీ' విడుద‌ల చేసిన వెంట‌నే.. అభ్య‌ర్థుల నుంచి ఈ కీ పైన Objections ను తీసుకుంటారు.

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

Published date : 06 Jul 2023 01:33PM

Photo Stories