Skip to main content

TSPSC Group 4 Exam Date : గ్రూప్‌-4 పరీక్ష తేదీ ఇదే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ రేపే.. మొత్తం ద‌ర‌ఖాస్తుల సంఖ్య‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ :తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించనున్న గ్రూప్‌-4 ప‌రీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది జులై 1న గ్రూప్ 4 పరీక్షను రెండు పేపర్లగా నిర్వహించనున్నారు.
TSPSC Group 4 Exam Date News telugu
TSPSC Group 4 Exam Date Details

ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ ఉదయం 10 గంటల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వరకు పేపర్ 1 ను నిర్వ‌హించ‌నున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 8,180 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు  గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌- 4 నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇప్పటికే దాదాపు 9లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

రేపే ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ..

tspsc group 4 online apply last date

ఫిబ్రవరి 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఇటీవల టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఫిబ్రవరి 3వ తేదీ (శుక్రవారం)తో గడువు ముగియనుండటంతో అభ్యర్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

☛ గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పోస్టులు ఇవే..

tspsc group 4 jobs list


☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ I&CADలో జూనియర్ స్టెనో
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో జూనియర్ స్టెనో
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్
☛ I&CADలో జూనియర్ అసిస్టెంట్
☛రెవెన్యూ శాఖలో టైపిస్టు
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో టైపిస్ట్
☛ గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
☛గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)
☛ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో జేఏ
☛ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

గ్రూప్‌-4 ప‌రీక్షావిధానం ఇదే..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.  ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, అలాగే పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

గ్రూప్‌-4 స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ మొత్తం మార్కులు: 300

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (ని.) మార్కులు
1 జనరల్‌ స్టడీస్‌ 150 150 150
2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 150 150
Published date : 02 Feb 2023 05:15PM

Photo Stories