Skip to main content

TSPSC: గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల; 9,168 పోస్టులు ఇవే..

తెలంగాణలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్‌-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

డిసెంబ‌ర్‌ 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పోస్టులు ఇవే..
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ I&CADలో జూనియర్ స్టెనో
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో జూనియర్ స్టెనో
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టైపిస్ట్
☛ I&CADలో జూనియర్ అసిస్టెంట్
☛రెవెన్యూ శాఖలో టైపిస్టు
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో టైపిస్ట్
☛ గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
☛గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)
☛ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో జేఏ
☛ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.

TSPSC Group-4 Syllabus

పేపర్-1 (మార్కులు 150) :

జనరల్ నాలెడ్జ్
వర్తమాన వ్యవహారాలు
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం
పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ
➤ భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు
భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు
➤ భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
➤ జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర
తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం
తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

పేపర్ -2 (మార్కులు 150) : 
☛ పాలనా సామర్థ్యాలు (సెక్రటేరియల్ ఎబిలిటీస్)
మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)
లాజికల్ రీజనింగ్
కాంప్రహెన్షన్
రీ-అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్
న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు..
నూతన జోనల్‌ విధానంతో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కుతుందని సీఎస్‌ సోమేశ్‌కుమార్ గ‌తంలో వెల్లడించిన విష‌యం తెల్సిందే. అలాగే జిల్లా కేడర్‌కు చెందిన గ్రూప్‌–4 ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే కేటాయించామని తెలిపారు. మిగతా 5 శాతంలో కూడా స్థానిక అభ్యర్థులకే ఎక్కువ అవకాశం దక్కుతుందన్నారు.

TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

అత్యధికం పోస్టులు ఇవే..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాలను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌–4 కేటగిరీలో అత్యధికం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్‌ సర్వీస్‌ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరించింది.

రెవెన్యూ శాఖలో..
గ్రూప్‌-4 ఉద్యోగాల్లో ప్రధానంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా 6,859 జూనియర్‌ అసిస్టెంట్‌  పోస్టులు, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,077 జూనియన్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

Published date : 01 Dec 2022 06:25PM

Photo Stories