TSPSC Group 4 Application : 9,168 గ్రూప్-4 పోస్టులకు నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.గ్రూప్స్ అభ్యర్థులంతా పోటీ పడే పరీక్ష ఇది ! అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా.. సివిల్స్, గ్రూప్-1, 2, 3 అభ్యర్థులు సైతం రాసే పరీక్ష గ్రూప్-4! కారణం.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే అభిలాష! ఈ సారి భారీగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ).. 9,168 గ్రూప్-4 సర్వీసెస్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే.
☛ టీఎస్పీఎస్సీ గ్రూప్-4 → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్
☛ గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
25 శాఖల్లో.. 9,168 పోస్టులు భర్తీకి..
టీఎస్పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో.. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ హోదాల్లో.. 9,168 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నది. గ్రూప్-1,2,3 సర్వీసులకు పోటీ పడే ప్రతి ఒక్కరూ గ్రూప్-4కు కూడా హాజరవుతారని చెబుతున్నారు. గతంలో 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్ఓ ఉద్యోగాలకు దాదాపు 10 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. అలాగే పరీక్షకు 76 శాతం మంది హాజరయ్యారు. గ్రూప్-4 కేటగిరీలో 2 వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడినప్పుడు 4.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈసారి ఏకంగా 9,168 పోస్టులు ఉండటంతో దాదాపు 10లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.
చదవండి: Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
పరీక్షావిధానం ఇలా..
రెండు పేపర్లుగా రాత పరీక్ష :
టీఎస్పీఎస్సీ గ్రూప్-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. ఇందులో పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ 150 మార్కులకు, అలాగే పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు
టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పోస్టులు ఇవే..
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్
☛ I&CADలో జూనియర్ స్టెనో
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో టైపిస్ట్
☛ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు ఫైర్ సర్వీసెస్‌లో జూనియర్ స్టెనో
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ స్టెనో
☛ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్
☛ I&CADలో జూనియర్ అసిస్టెంట్
☛రెవెన్యూ శాఖలో టైపిస్టు
☛ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ పంచాయతీ రాజ్‌లో టైపిస్ట్
☛ గ్రామ రెవెన్యూ అధికారి (VRO)
☛గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)
☛ తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో జేఏ
☛ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో జూనియర్ అసిస్టెంట్
☛ అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్.
చదవండి: TSPSC గ్రూప్–4 సర్వీసెస్ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి
రెవెన్యూ శాఖలోనే ..
గ్రూప్–4 ఉద్యోగాల్లో ప్రధానంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి.