APPSC Group 2 Posts Increase : 720 గ్రూప్-2 పోస్టులు.. ఇంకా..
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ గ్రూప్-2 పోస్టుల సంఖ్య 720 పెంచనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ నెలలో లేదా నవంబర్ ఈ గ్రూప్-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. గ్రూప్-1&2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏక్షణంలోనై గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది.
చదవండి: Groups Preparation Tips: గ్రూప్స్ 1&2..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్ కొట్టేలా!
ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 పోస్టులకు ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ తదితర వివరాలు..
సిలబస్‌పై..
మరికొద్ది రోజుల్లోనే ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు రావడం ఖాయమని స్పష్టమైంది. కాబట్టి ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు అభ్యర్థులు సిలబస్‌పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. తాము పోటీ పడదలచుకుంటున్న పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను లోతుగా పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే గ్రూప్–1ను లక్ష్యంగా చేసుకునే అభ్యర్థులు మరింత పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందుగా ప్రిలిమ్స్, మెయిన్ సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ తర్వాత ఆయా అంశాలకు కల్పిస్తున్న వెయిటేజీని గమనించాలి. దీనికి అనుగుణంగా ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకొని దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రారంభించాలి.
గ్రూప్ 2 పరీక్షావిధానం ఇలా..
గ్రూప్–2 పరీక్షను రెండు దశలుగా(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్) నిర్వహిస్తారు. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారికి 1:50 నిష్పత్తిలో రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లో ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది.
80 శాతం ఉమ్మడి అంశాలే.. వీటిపై..
గ్రూప్–1, గ్రూప్–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం ఉమ్మడి అంశాలే! కాబట్టి అభ్యర్థులు గ్రూప్–1 ఓరియెంటేషన్‌తో, డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగిస్తే... గ్రూప్–2 సిలబస్‌పైనా పట్టు లభించే అవకాశం ఉంది. ఆయా టాపిక్‌లను చదివేటప్పుడు కోర్ సబ్జెక్ట్‌ను విస్తృతంగా అన్ని కోణాల్లో చదువుతూ.. సమకాలీన పరిణామాలతో సమన్వయం చేసుకోవాలి. తద్వారా ఏకకాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో రాణించేందుకు వీలవుతుంది.
సమకాలీన అంశాలపై..
గ్రూప్స్ అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్ నుంచే ఆయా అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌కు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో పట్టు సాధించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్ కేటాయింపులు తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా జరుగుతున్న అభివృద్ధిపై దృష్టి సారించాలి. దీంతోపాటు జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి అవగాహన పెంచుకోవాలి.
☛ APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
గ్రూప్స్ అభ్యర్థులు ప్రతి అంశాన్ని చదివేటప్పుడు అన్వయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ముఖ్యంగా సమకాలీన అంశాలు సమ్మిళితంగా ఉండే ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అదే విధంగా చదివే సమయంలోనే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. నిరంతరం తమ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు మోడల్ టెస్ట్స్‌కు హాజరు కావడం మేలు చేస్తుంది.
ప్రీవియస్ పేపర్స్‌ను..
గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షలో సదరు అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ప్రశ్నలు అడుగుతున్న తీరు తెలుస్తుంది. ఆయా టాపిక్స్‌పై తమకున్న పట్టు, ఇంకా మెరుగుపరచుకోవాల్సిన విషయాల్లోనూ స్పష్టత లభిస్తుంది.
Tags
- Appsc group 2 jobs 2023
- appsc group 2 posts increased 2023 telugu news
- APPSC Group-2 Notification 2023
- 750 APPSC Group 2 Jobs 2023
- APPSC Group 2 Syllabus
- APPSC Group-2 Recruitment 2023 Details
- APPSC Group-2 Vacancy 2023 Details
- Eligibility Criteria for APPSC Group-2 Recruitment 2023
- appsc members 2023
- appsc group 2 jobs notification
- appsc group 2 notification dates 2023
- appsc group 2 posts 750 above increase 2023
- APPSC Group-2 Posts
- Sakshi Education News
- Group-2 Recruitment
- Andhra Pradesh Government
- Sakshi Education Latest News