Skip to main content

APPSC Group-2 Jobs : రాష్ట్రవ్యాప్తంగా లెజండరీ ఫ్యాకల్టీల‌తో.. సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ ఆధ్వ‌ర్యంలో గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌పై ఉచిత అవగాహన సదస్సులు.. తేదీలు ఇవే..

appsc group 2 jobs news telugu
APPSC Group 2 Jobs 2023

☛ సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్, ఆర్.సి ఎగ్జామ్స్ సంస్థ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవగాహన సదస్సులు

☛ రాష్ట్ర వ్యాప్తంగా 13 పట్టణాల్లో ఉచిత అవగాహన సదస్సులు

☛ టాలెంట్ టెస్ట్ నిర్వహించి మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లోనే దాదాపు 1000 వ‌ర‌కు గ్రూప్‌-2 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నేపథ్యంలో.. గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com), రాష్ట్రంలోని ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ ఆర్.సి ఎగ్జామ్స్ క‌లిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్ర‌ధాన‌ పట్టణాల్లో ఉచిత అవగాహన సదస్సులు, టాలెంట్ టెస్ట్‌ల‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ తోడుగా ఉంటున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.

లెజండరీ ఫ్యాకల్టీల‌తో..
ఇందులో భాగంగా ఈ అవగాహన సదస్సును రాష్ట్రంలోనే లెజండరీ ఫ్యాకల్టీలైన బి.కృష్ణారెడ్డి (పాలిటీ), అబ్దుల్ కరీం(హిస్టరీ), సి.హరికృష్ణ (సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎండీ పాషా (ఎకానమీ), ప్రొ. చింతా గణేష్ (సోషియాలజీ), మట్టపల్లి రాఘవేంద్ర(కరెంట్ అఫైర్స్), శంకర్ రెడ్డి(మెంటల్ ఎబిలిటీ), జల్లు సద్గుణరావు (జాగ్రఫీ) లాంటి లెజండరీ ఫ్యాకల్టీలు హాజరుకానున్నారు.

అవగాహన సదస్సుల తేదీలు ఇవే.. అలాగే బహుమతులు కూడా..

appsc group 2 jobs news

జూన్ 4వ తేదీ ఉద‌యం 09:30 to 12:30 వ‌ర‌కు అనంతపురంలోని Dr Br Ambedkar Convention Centre, Sai Nagar నందు ఈ అవగాహన సదస్సు నిర్వ‌హించ‌నున్నారు. అలాగే జూన్ 10న కడప, జూన్ 11న తిరుపతిలో ముందుగా అవగాహన సదస్సులు నిర్వహించ‌నున్నారు. ఆ తర్వాత గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, ఏలూరు, కర్నూలు, శీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదలైన పట్టణాల్లో అవగాహన సదస్సులు ఉంటాయి. అవగాహన సదస్సుతో పాటు.. అదే రోజు టాలెంట్ టెస్ట్ నిర్వహించి జిల్లాలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇవ్వ‌నున్నారు. 

త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండటం.. దీనికి తోడు గ్రూప్-2కు కొత్త సిలబస్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అవగాహన సదస్సు, టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్ నెంబర్‌కు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్‌లో పంపాలి.

Published date : 29 May 2023 01:32PM

Photo Stories