Success Story: ఒక వైపు వైకల్యం.. మరోవైపు పేదరికంతో పోరాడి గ్రూప్-2 కొట్టానిలా..
ఎన్ని అవాంతరాలెదురైనా మొక్కవోని దీక్షతో ముందుకుసాగి లక్ష్యం చేరుకున్నారు.. కర్నూలు జిల్లాకు చెందిన షేక్ హసీనా.. వైకల్యం, పేదరికం వెన్నాడు తున్నా వెరవకుండా.. గ్రూప్-2 వికలాంగుల విభాగంలో జోన్-4 టాపర్ (293 మార్కులు) గా.. తనలాంటి మరెందరికో స్ఫూర్తిగా నిలిచిన హసీనా సక్సెస్ స్టోరీ మీ కోసం..!!
Group 1 Ranker: ఆన్‌లైన్ కోచింగ్..గ్రూప్–1 ఉద్యోగం
విజేతగా నిలిస్తే..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో పరిశ్రమించి, విజేతగా నిలిస్తే ఆ సంతోషం వర్ణించలేనిది. ఇప్పుడు ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఒకరకంగా ఈ విజయం పేదలకు సేవచేయడానికి నేను ఎంచుకున్న భవిష్యత్తు లక్ష్యానికి కొండంత బలాన్నిచ్చినట్లయింది.
Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
మీరు గ్రూప్-2లో ఏఏ పోస్టులకు ప్రదాన్యత ఇచ్చారు..?
గ్రూప్-2లో మొత్తం 293 మార్కులొచ్చాయి. నాలుగోజోన్‌కు చెందిన అభ్యర్థిని. పోస్టుల ప్రిఫరెన్స్‌లో భాగంగా డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ పోస్టులకు ఆప్షన్ ఇచ్చాను.
మీ కుటుంబ నేపథ్యం, చదువు ఏమిటి?
మాది కర్నూలు జిల్లా, నంద్యాల. టెన్త్, ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నా. డిగ్రీలో బీఎస్సీ చదివా. 2005లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. నాన్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పేదరికంతో ఇబ్బందులెదురైనా చదువుకోవాలనే తపనతో సమస్యలను అధిగమించా. ఆర్‌సీరెడ్డి స్టడీ సర్కిల్ హిస్టరీ ఫ్యాకల్టీ కరీం ఆర్థికంగా, శిక్షణపరంగా అందించిన తోడ్పాటు నా విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
మీ ప్రిపరేషన్ ఎలా సాగింది..?
మాది పేదకుటుంబం. పేదల కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. భవిష్యత్తులో నాలాంటి వారికి సాయంచేసి.. వాళ్ల భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేయాలనే లక్ష్యంతో సివిల్ సర్వీసును ఎంపికచేసుకున్నా. అందులో భాగంగా నా ప్రయత్నాన్ని గ్రూప్స్ నుంచి మొదలుపెట్టా.
ఇప్పటి వరకు మీరు ఏమైనా పోటీ పరీక్షలు రాశారా..?
సివిల్స్‌కు ఎంపికవాలనే లక్ష్యంతో ప్రస్తుతం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నా. గ్రూప్-2కు ముందు జేఎల్ పోస్టులకు దరఖాస్తు చేశా. ఇంటర్వ్యూ దశ వరకు వచ్చా.
గ్రూప్-2కు మీ ప్రిపరేషన్ ప్రణాళిక ఏమిటి..?
పేదరికాన్ని జయించాలంటే.. కచ్చితంగా గ్రూప్-2లో విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నా. పట్టువదలకుండా గెలిచి తీరాలనుకున్నా. అందుకే ఓవైపు కోచింగ్ తీసుకుంటూనే.. సబ్జెక్టులను ఆసాంతం చదివి అవగాహన పెంచుకున్నా. 2008లో నోటిఫికేషన్ వెలువడినా.. పరీక్ష 2011లో జరగడంతో అందుబాటులోని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాగాను. రివిజన్ కోసం కొన్ని సందర్భాల్లో రోజుకు 14 గంటలు చదివాను. గ్రూప్-2 నా ఫస్ట్ అటెంప్ట్ కావడంతో ఒక్కో సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేశా. ఇది భవిష్యత్తులో సివిల్స్ రాయాలనే నా లక్ష్యానికి ఉపయోగపడుతుంది.
పోటీ పరీక్షల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
మీరు ఏఏ పుస్తకాలు చదివారు..?
ఒక్కో సబ్జెక్టుపై అవగాహనకు మూడు నెలలు.. ఆ తర్వాత రివిజన్‌కు మరో మూడు నెలలు కేటాయించాను. ప్రధానంగా పేపర్-1 కోసం కరెంట్ అఫైర్స్ పుస్తకాలు, ఫ్యాకల్టీ నోట్స్, పత్రికలు, మ్యాగజైన్లపై ఆధారపడ్డా. పేపర్-2లో పాలిటీ, హిస్టరీ సబ్జెక్టులను వేర్వేరుగా ప్లాన్ చేసుకుని చదివా. సివిల్స్ లక్ష్యంలో భాగంగా.. హిస్టరీని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుని ఎప్పట్నుంచో ఆ సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడం ఎంతో లాభించింది. పాలిటీ విభాగంలో కోచింగ్ ఫ్యాకల్టీ నోట్స్, పేపర్-3 ఎకానమీకి తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు ఆర్థికసర్వే చదివాను.
Virendra, Excise SI: కూలీ పనిచేస్తూ..ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..
Success Story: ఓకే సారి గ్రూప్-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్.. వీరి సక్సెస్ సిక్రెట్ చూస్తే..
మీ ఇంటర్వ్యూ ఎలా సాగింది ?
అయిదుగురు సభ్యుల బోర్డు సుమారు 15 నిమిషాలకుపైగానే ఇంటర్వ్యూ చేసింది. స్వస్థలం నంద్యాల కావడంతో నంద్యాలకు ఆ పేరు ఎలా వచ్చింది? డిప్యూటీ తహసీల్దార్ విధులేంటి? మీకు అంగవైకల్యం కదా... ఎప్పుడైనా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మీరు డిప్యూటీ తహసీల్దార్ అయితే గృహహింస చట్టాన్ని ఎలా అమలుచేస్తారో చెప్పగలరా? దేశంలో పోలియో వ్యాధి ఇంకా ఎక్కడెక్కడ ఉంది? వంటి ప్రశ్నలు అడిగారు.
పోటీపరీక్షలకు ఉపయోగపడే డైలీ,వీక్లీ,మంత్లీ కరెంట్అఫైర్స్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
పోటీపరీక్షలకు కోచింగ్ అవసరమా.. లేదా..?
కష్టపడి చదివితే కోచింగ్ లేకుండా విజయం సాధించవచ్చని చెప్పడం సులువే. కానీ ఇందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు విజయం సాధించలేకపోవచ్చు. కోచింగ్ వల్ల ఏ సబ్జెక్టును, ఎంతమేరకు, ఏ స్థాయిలో చదవాలో కోచింగ్ ద్వారా తెలుస్తుంది.
మీ జీవిత లక్ష్యం ఏమిటి..?
ఐఏఎస్ అధికారి కావాలనేదే నా జీవితాశయం. గతంలో ఓసారి పూర్తిస్థాయి అవగాహన లేకుండానే రాశా. కానీ ఈ సారి అన్ని విషయాలపై సమగ్ర అవగాహనతో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువమందికి సాయం చేయవచ్చనేది నా అభిప్రాయం.
గ్రూప్స్ పరీక్షల స్టడీమెటీరిల్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీ సలహా..?
సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే విజయం వరకు వెళ్ల డం అసాధ్యమేమీ కాదు. కానీ లక్ష్యసాధనలో ఎన్ని కష్టాలొచ్చినా.. వెరవకుండా పోరాడితే విజయం సాధించవచ్చు. అలాగే గ్రూప్స్ లేదా సివిల్స్‌ను తొలిప్రయత్నంలోనే కొట్టాలని, లేకపోతే ఆ తర్వాత సాధించడం సాధ్యం కాదని చాలామంది భావిస్తుంటారు. అది సరికాదు. అనుభవాన్ని విజయానికి పునాదిగా మల్చుకున్నవాళ్లే విజేతలవుతారు.
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..