Skip to main content

APPSC Group-1 Ranker Success Story : ఈ అపోహను వీడితే.. గ్రూపు–1 కొట్ట‌డం ఈజీనే.. నేను కూడా..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది.
APPSC Group-1 Ranker Sri Chandana
APPSC Group-1 Ranker Sri Chandana

2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి ఆర్డీఓ ఉద్యోగానికి ఎంపికైన యడ్ల శ్రీ చందన స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

APPSC Group-1 & 2 Posts: ఆగ‌స్టులో గ్రూప్‌–1 & 2 నోటిఫికేషన్లు.. మొత్తం ఎన్ని పోస్టులకు అంటే..?

కుటుంబ నేప‌థ్యం :
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ (ఏపీపీఎస్‌సీ) విడుదల చేసిన ఫలితాల్లో తెనాలి మండలం కొలకలూరుకు చెందిన యడ్ల శ్రీ చందన ఎంపికైంది. ఈ ఫలితాల్లో శ్రీచందన ఆర్డీఓగా  ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా.. కొలకలూరు గ్రామంలోని వారి స్వగృహాం పలువురు గ్రామస్తులు, ఉపాధ్యాయులు వెళ్లి శ్రీ చందనను అభినందించారు. తల్లిదండ్రులు యడ్ల శ్రీధర్, శివదుర్గాకుమారి, సోదరుడు భరత్‌లు శ్రీచందనకు మిఠాయిల తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.

Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

నా ఎడ్యుకేష‌న్‌..
పదో తరగతి వరకు గ్రామంలోని జూబ్లీ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఇంటర్‌ నారాయణ కాలేజ్, బాపట్లలో ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ చేశాను. మా తల్లిదండ్రులు శ్రీధర్, శివదుర్గాకుమారి, మా మేనత్త శ్రీలీలను స్ఫూర్తిగా తీసుకుని చదివాను.

Success Story: గ్రూప్‌-1లో టాప్ ర్యాంక్‌ కొట్టానిలా..

ఈ అపోహ తొలగిపోవాలి..

APPSC Group-1 Ranker Success Story


కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌ ప్రోత్సాహంతో విజయం సాధించగలిగాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వారు గ్రూపు–1, సివిల్స్‌పై అపోహ ఉంటుంది. అది తొలగిపోవాలి. రోజుకు 18 గంటలు చదివాను. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగ వచ్చిన వెళ్లలేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం సాధించాలనే లక్ష్యంతో చదివాను. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమవుతున్నాను.

Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్న‌ట్టే కొట్టా..

టాప్‌-10లో ఏడుగురు మహిళలే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు.  అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.

Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?

Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!

Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..

1,14,473 మంది..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చారు. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 1,14,473 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 58,059 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేశారు. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో మూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించారు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచారు. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశారు. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు.

Published date : 30 Jul 2022 08:09PM

Photo Stories