Group 1 Ranker Success Story: రైతు బిడ్డ.. ఆర్టీఓ ఉద్యోగానికి సెలక్ట్.. ఈమె విజయం సాధించడానికి..
ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్ మూల్యాంకనం ఇలా చాలా సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 (2018) ఫైనల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ ఉద్యోగానికి ఎంపికైన గొర్ల మనీషా సక్సెస్ స్టోరీ మీకోసం..
Success Story: సొంతంగానే గ్రూప్-1కి ప్రిపేరయ్యా.. టాప్ ర్యాంక్ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..
కుటుంబ నేపథ్యం :
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు.
Virendra, Excise SI: కూలీ పనిచేస్తూ..ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..
నా ఎడ్యుకేషన్ :
ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్‌లో జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు.
Success Story: ఓకే సారి గ్రూప్-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్.. వీరి సక్సెస్ సిక్రెట్ చూస్తే..
వీరి కోరిక మేరకే..
ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
ఈ సారి మహిళలదే హవా..
గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలుండడం గొప్ప విషయం. పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే ఉన్నారు. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు. అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. ఇంకా 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు ఉన్నారు. 18 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. ఇందులో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉండటం విశేషం.
Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్నట్టే కొట్టా..