APPSC Group-1 Ranker: ఆ రైతు అష్టకష్టాలు పడి చదివించాడు.. కొడుకు అనుకున్నది సాధించాడు.. నేడు డిప్యూటీ కలెక్టర్‌గా..
ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి కమిషన్ చివరికి ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ఈ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కోతలగుట్టపల్లె గ్రామానికి చెందిన కొండూరు శ్రీనివాసరాజు గ్రూప్-1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించారు.
కుటుంబ నేపథ్యం :
మాది అన్నమయ్య జిల్లా పోతులగుట్టపల్లి. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. నాన్న రెడ్డయ్య రాజు, తులసమ్మలు వ్యవసాయం చేస్తారు. అష్టకష్టాలు పడి.. నన్ను చదివించారు. ఇప్పుడు మా ఇంట పండుగ వాతావరణం నెలకొందన్నారు.
Success Story: ఫస్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..
నా ఎడ్యుకేషన్ ఇలా.. :
1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలో చదివాను. అలాగే 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాయచోటిలో చదివాను. అలాగే కడపలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ పూర్తి చేశాను.
Success Story: ఒక పోస్టు నాదే అనుకుని చదివా.. అనుకున్నట్టే కొట్టా..
మూడు సార్లు సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత.. కానీ
2017లో సివిల్స్ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. అనంతరం 2018లో గ్రూప్–1 రాశాను. కష్టపడి చదివినందుకు ఈ ఫలితం దక్కింది. అలాగే గ్రూప్-1లో ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాంక్‌తో డిప్యూటీ కలెక్టర్ అయ్యే అవకాశం వస్తుందన్నారు. దిల్లీలో కోచింగ్ తీసుకుని మూడు సార్లు సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ దాకా వెళ్లారు.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా