Skip to main content

APPSC Group-1 Ranker Success Story: ఆన్‌లైన్‌లో చ‌దివి గ్రూప్‌-1 కొట్టానిలా.. కోచింగ్ లేకుండానే..

పలు సవాళ్లను అధిగమించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ ఎట్ట‌కేల‌కు గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఇటీవ‌లే ప్ర‌క‌టించింది.
పాలపర్తి జాన్‌ ఇర్విన్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్ (2018)
పాలపర్తి జాన్‌ ఇర్విన్‌, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంక‌ర్ (2018)

2018 గ్రూప్‌–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ఫ‌లితాల్లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన పాలపర్తి జాన్‌ ఇర్విన్‌తో సాక్షి ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ మీకోసం..

Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..

ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌థ‌కాల‌ను అర్హులకు అందించడమేగా లక్ష్యంగా పనిచేస్తానని గ్రూప్‌–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన భీమవరం పట్టణానికి చెందిన పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ చెప్పారు. ప్ర‌స్తుతం పశ్చిమ బెంగాల్‌–బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌(ఏసీఐఓ)గా పనిచేస్తున్నారు. నేరుగా ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో  2009లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చినా వదులుకున్నానని, సివిల్స్‌ లక్ష్యంతోనే ముందుకు సాగానని చెప్పారు.

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

సాక్షి:  గ్రూప్‌–1కు ప్రిపేర్‌ కావడానికి మీకు స్ఫూర్తి ఎవరు? 
ఇర్విన్‌ : మా తాతయ్య జేసురత్నమే నాకు స్ఫూర్తి. ఆయన ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవారు. ప్రజలకు నేరుగా సేవచేసే ఉద్యోగం సంపాదించాలని చెబుతుండేవారు. దాంతో సివిల్స్‌పై ఆసక్తి పెరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ రావ‌డంతో ఆ దిశగా ప్రయత్నంచా.

APPSC Group-1 Ranker Success : గ్రూపు–1 స‌క్సెస్ సాధించానిలా.. ఎప్ప‌టికైనా నా ల‌క్ష్యం ఇదే..

సాక్షి:  మీ విద్యాభ్యాసం ఎక్కడ జ‌రిగింది? ఎలా సాగింది?
ఇర్విన్‌:  నా విద్యాభ్యాసం భీమవరంలోనే సాగింది. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశా. కాలికట్‌ నిట్‌లో ఎంటెక్‌ చదివాను.

APPSC Group 1 Ranker Success Story : ఈ ల‌క్ష్యం కోస‌మే చ‌దివా.. అనుకున్న‌ట్టే.. డిప్యూటీ కలెక్టర్ కొట్టానిలా..
 
సాక్షి: మీరు గ్రూప్‌–1కి ఎలా ప్రిపేర్‌ అయ్యారు?
ఇర్విన్‌: గ్రూప్‌–1 కోసం ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. మిత్రుల సహకారం, ఆన్‌లైన్‌లో చదవడమే. సివిల్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేశా. పరీక్ష బాగా రాసినా రిజల్ట్‌ రావడానికి ఆలస్యం కావడంతో 2015లో కేంద్ర నిఘా విభాగంలో ఉద్యోగావకాశం వచ్చింది. దీంతో కొంత గ్యాప్‌ తీసుకుని గ్రూప్స్‌కు ఇంటర్వ్యూకు ప్రిపేర్‌ అయ్యాను.

Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!

సాక్షి: మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? 
ఇర్విన్‌: మా నాన్న  బెల్తాజర్‌ ఉపాధ్యాయుడు, తల్లి మరియమ్మ గృహిణి. వారి ప్రోత్సహంతోనే ముందుకు సాగా. అపజయాలు ఎదురైనా వెన్నుతట్టి ముందుకు నడిపించారు.

APPSC Group-1 Ranker Success Story: మా మామకు ఇచ్చిన మాట కోసమే.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..

సాక్షి: మీ కుటుంబం నేప‌థ్యం..?

Family


ఇర్విన్‌: భార్య కేథరినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఆమె ప్రోత్సహం మరువలేనిది. ఒక కుమారుడు ఉన్నాడు.

సాక్షి: గ్రూప్‌–1 అధికారిగా మీ మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు..?
ఇర్విన్‌: బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు వారి సక్రమంగా అందేలా కృషిచేస్తా. అదే నా మొదటి ప్రాధాన్యత.

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

Published date : 12 Jul 2022 03:43PM

Photo Stories