APPSC Group-1 Ranker Success Story : గ్రూప్-1 కొట్టా.. డీఎస్పీ ఉద్యోగం పట్టా..
2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ గ్రూప్–1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి.. 'అజీజ్' డీఎస్పీగా ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో అజీజ్ సక్సెస్ స్టోరీ మీకోసం..
Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!
కుటుంబ నేపథ్యం :
మాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామం. మా నాన్న మాజీ సైనికోద్యోగి సజీర్ అహమ్మద్. తల్లి మదార్‌బీబీ. నా సోదరుడు హైదరాబాద్ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నారు. సోదరి విజయవాడలోని కస్టమ్స్ బ్యాంకులో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
ఎడ్యుకేషన్:
10వ తరగతి వరకు స్థానిక రవీంద్ర నారాయణ స్కూల్‌లో చదివాను. అలాగే ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కళాశాలలో పూర్తి చేశాను. బీటెక్‌ను కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాను.
గ్రూప్-1 సాధించడం కోసం..
2015 నుంచి గ్రూప్ -1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. 2017లో గ్రూప్ -1 మెయిన్ కియర్ కాలేదు. మళ్లీ మొక్కవోని ఆశయంతో 2018లో తిరిగి ప్రయత్నించి విజయం సాధించి.. డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యాను.
వీరి సహాకారంతోనే..
మా తల్లిదండ్రుల సహాకారంతో.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాను. నా విజయంతో మా తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైంది. అజీజ్ డీఎస్పీగా ఎంపికకావడం పట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నర్రా పేరయ్య, సభ్యులు భాస్కర్ రెడ్డి, నారాయణ, రాజశేఖర్ రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..