APPSC Group-1 Ranker Success: తొలి ప్రయత్నంలోనే.. డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా.. నా విజయానికి కారణం ఇవే..
2018 గ్రూప్–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన అయిన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
నెల్లూరు టౌన్ మాగుంటలే అవుట్‌లోని పావని అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వల్లెం ప్రతాప్‌రెడ్డి విశ్రాంత మున్సిపల్ ఉద్యోగి. ఆయన సతీమణి వెంకటరమణమ్మ గృహిణి. వారికి విష్ణుస్వరూప్‌రెడ్డి, సుక్రుతరెడ్డి సంతానం. విష్ణుస్వరూప్‌రెడ్డి చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎంలో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు.
APPSC Group-1 Ranker Success Story: మా మామకు ఇచ్చిన మాట కోసమే.. డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా..
తొలి ప్రయత్నంలోనే.. డీఎస్పీగా
చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉండేది. మేనమామ శివారెడ్డి, ఇంకా డాక్టర్ వివేకానందరెడ్డి ప్రోత్సాహంతో ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో ప్రణాళికతో సన్నద్ధమై రాశారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీగా ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం విష్ణుస్వరూప్‌రెడ్డి దుబాయ్‌లో ఎంబీఏ చదువుతున్నారు.
ఇవే తన విజయానికి బాటలు వేశాయ్..
‘క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే కలలను సాకారం చేసుకోగలం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పుస్తక పఠానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే తన విజయానికి బాటలు వేశాయి.’ అని గ్రూప్–1లో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి అన్నారు.
APPSC Group 1 Ranker Success Story : నా ఫోన్‌తోనే.. గ్రూప్-1 ర్యాంక్ కొట్టానిలా.. ఎలా అంటే..?