APPSC Group-1 Ranker : మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-1 కొట్టానిలా.. ఎప్పటికైనా నా లక్ష్యం ఇదే..
ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ గ్రూప్–1 (2018) ఫైనల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది. 2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ గ్రూప్–1 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి.. నందిపాటి ప్రేమాన్విత ఎంపీడీవోగా ఉద్యోగానికి ఎంపికైంది. ఈ నేపథ్యంలో ప్రేమాన్విత సక్సెస్ స్టోరీ మీకోసం..
Success Story: నోటిఫికేషన్ చూశాకే.. గ్రూప్-2 పై దృష్టి పెట్టి.. సాధించానిలా..
కుటుంబ నేపథ్యం :
మాది బీమవరం పట్టణం. మా నాన్న నందిపాటి రామకృష్ణ. వాసవీ క్లబ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మా అమ్మ చంద్రకళ.
Chaitra Varshini, RDO : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే గ్రూప్స్‌లో విజయం ఖాయమే..!
నా ఎడ్యుకేషన్:
బీమవరంలోనే బీటెక్ పూర్తి చేశాను. 2018లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు నేను తొలిసారిగా హాజరయ్యాను. మొదటి ప్రయత్నంలోనే ఎంపీడీవోగా ఉద్యోగం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా నా లక్ష్యం సివిల్స్ సాధించడమే. ఇందు కోసం ఢిల్లీలో కోచింగ్ కూడా తీసుకున్నాను. తప్పక సాధిస్తానని ధీమాతో ఉన్నా..
ఈ సారి గ్రూప్-1 ఫలితాల్లో మహిళలదే హావా..
ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు. అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.