Skip to main content

APPSC Group-1 Ranker SaiSree Success Story : తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కొట్టానిలా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-1 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశ‌లు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. ఎన్నో న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి.. ఎట్ట‌కేల‌కు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌–1 (2018) ఫైన‌ల్ ఎంపిక జాబితాను విడుద‌ల చేసింది.
ఆదిమూలం సాయిశ్రీ, డిప్యూటీ కలెక్టర్, పదో ర్యాంకర్‌
ఆదిమూలం సాయిశ్రీ, డిప్యూటీ కలెక్టర్, పదో ర్యాంకర్‌

2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.  ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–1లో ఫ‌లితాల్లో 10వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి ఎంపికైన ఆదిమూలం సాయిశ్రీ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

APPSC Group-1 Top Ranker Rani Sushmita: ఎలాంటి కోచింగ్ లేకుండానే ఫ‌స్ట్ ర్యాంక్ కొట్ట‌నిలా.. వీరి స‌హాయం లేకుంటే..

తొలి ప్రయత్నంలోనే విజ‌యం..
నా తల్లిదండ్రులు మోహన్, సునీత ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు వచ్చాను. 2017లో హెచ్‌సీయూలో ఎంఏ పూర్తి చేశాను. 2019లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్‌గా అవకాశం దక్కింది. 

Inspirational Success Story: సివిల్స్‌లో 37వ ర్యాంక్ కొట్టా.. గ్రూప్‌-1లో 3వ ర్యాంక్ కొట్టా.. ఈ క్రెడిట్ అంతా ఈయ‌న‌కే..

ఈ సారి మహిళలదే కీరిటం..
ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలు ఉన్నారు. ఈ గ్రూప్‌-1 పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలే ఉన్నారు. అలాగే ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారే. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారు.  అలాగే ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లు ఉండటం విశేషం. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారు.

Success Story: సొంతంగానే గ్రూప్‌-1కి ప్రిపేర‌య్యా.. టాప్ ర్యాంక్‌ కొట్టా.. డిప్యూటీ కలెక్టర్ అయ్యా..

Published date : 14 Jul 2022 06:01PM

Photo Stories